Breaking News

మామిడి జీడితో అద్భుతమైన ప్రయోజనాలు కానీ వాళ్లకు డేంజర్‌

Published on Thu, 05/29/2025 - 16:18

ఇపుడు మామిడి కాయలు, మామిడి పళ్ల సీజన్‌ నడుస్తోంది.  సాధారణంగా తియ..తీయ్యటి మామిడి పండును చక్కగా ఆరగిస్తాం. టెంకను వదలకుండా శుభ్రంగా రసాన్ని పీల్చి పిప్పి చేసేదాకా  వదలం కదా.. మరి  మామిడి పండులోని జీడి గురించి ఎపుడైనా ఆలోచించారా? 

పనికి  రాదనుకొని బయట పారేసే జీడితో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా? ఇందులో సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని పురాతన కాలం నుండి అనేక ఆయుర్వేద మందులు, కొన్ని చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు మామిడిలోని పిక్క, లేదా గింజతో  నూనె కూడా తయారు చేస్తారు. ఈ నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్ల అధికంగా ఉంటాయి. ఈ నూనెతో చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. 

మ్యాంగో సీడ్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి కాయ టెంకలోని విత్తనాన్ని జీడి లేదా పుడక అంటారు. ఈ జీడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీమైక్రోబయల్, లక్షణాలంటాయి.  విటమిన్లు , ఖనిజాలతో సమృద్ధిగా లభిస్తాయి. 

రోగనిరోధకవ్యవస్థకు: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న మామిడి గింజల పొడి, రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

యాంటీ డయాబెటిక్, బరువు తగ్గేందుకు : మామిడి గింజలు, ముఖ్యంగా ఆఫ్రికన్ మామిడి గింజల సారం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో , బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణ ఆరోగ్యం: మామిడి గింజలు విరేచనాలు వంటి జీర్ణ సమస్యలకు  చక్కటి పరిష్కారంగా తోడ్పడతాయి.  దంత ఆరోగ్యానికి టూత్ పౌడర్‌ను తయారు చేసుకొని ఉపయోగించవచ్చు.

చర్మం, జుట్టు : ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, మొటిమలు,తదిర చర్మ  సమస్యలకు మామిడి గింజల నూనెను ఉపయోగించవచ్చు.  మెరిసిన జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.  జుట్టు నల్లగా, పొడవుగా, హెల్దీగామారుతుంది. 

ఫేస్ క్లెన్సర్: మామిడి జీడి, టమాటాతో  తయారు చేసిన స్క్రబ్,  చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, బ్లాక్‌హెడ్స్, మొటిమలు, మచ్చలను నయం చేయడానికి, ముఖంపై ఏర్పడ్డ రంద్రాలను ఫిల్‌ చేయడానికి, ఎరుపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది

కాలేయ ఆరోగ్యానికి: మామిడి గింజలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.  కాలేయంలోని టాక్సిన్స్‌ను తొలగించి,  పనితీరును మెరుగుపరుస్తాయి.  అవి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

దంతాలకు: మామిడికాయలో జీడి పొడి దంతాలకు మేలు చేస్తుంది. రెగ్యూలర్‌గా బ్రష్‌ చేసుకుంటే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మామిడి గింజలను శిశువులకు సహజ దంతాలను తొలగించే సాధనంగా ఉపయోగించవచ్చు. ఈ పొడిని యాలకుల పొడితో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. 

పోషక విలువలు: మామిడి గింజలు విటమిన్లు A, C, D, E, K,  B విటమిన్ల (B1, B2, B3, B5, B6, B7, B9,  B12) మంచి మూలం.
మామిడి గింజలను  ఎలా వాడాలి?

మామిడి గింజల పొడి: విత్తనాలనుబాగా ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి  చేసుకోవాలి. ఈ పొడిని స్మూతీలు, జ్యూస్‌లు లేదా నీటిలో కలపవచ్చు. జీర్ణక్రియకు సహాయపడటానికి, కడుపు సమస్యలను తగ్గించడానికి మామిడి గింజల పొడిని తేనె లేదా నీటితో కలిపి తీసుకుంటారు

టీ: ఎండెబెట్టి పొడి చేసిన మామిడి గింజల పొడిని టీ తయారు చేసుకోవచ్చు.

ఆరోగ్య సప్లిమెంట్లు: మామిడి గింజల సారాన్ని ఆహార పదార్ధంగా తీసుకోవచ్చు, క్యాప్సూల్ లేదా టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. కొంతమంది వీటిని  మామిడి కాయ నిల్వ పచ్చడిలో కూడా కలుపుతారు.

నోట్‌: మామిడి గింజలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మామిడి గింజలను అస్సలు తీసుకోకూడదని చెబుతారు నిపుణులు. అలాగే మామిడి గింజల పొడిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే టానిన్లు, ఫైటేట్లు, సాపోనిన్లు జీర్ణక్రియకు  హాని చేయవచ్చు. వీటిని ఆహారంలో  చేర్చుకునే ముందు లేదా చర్మ లేదా జుట్టు సంరక్షణకు వినియోగించేముందు, వైద్యుడిని లేదా బ్యూఐటీ ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించడం మంచిది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)