Breaking News

స్వరాల సంబురం

Published on Thu, 01/15/2026 - 05:58

ఇప్పుడు తెలుగువారికి పండుగ రోజుల్లో పిండివంటలతో పాటు పాటలు కూడా వస్తున్నాయంటే ఆ ట్రెండ్‌కి సృష్టికర్త ఆమే. తెలుగు జానపద కళాకారులు యూ ట్యూబ్‌ వేదికగా సృష్టిస్తున్న నేటి సోలో సంచలనాలకు నిన్న నాంది పలికింది ఆమే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఓ  కుటుంబానికి చెందిన యువతి.. ఇప్పుడు కోట్లాది మంది తెలుగు లోగిళ్లలో నిత్యం కని–వినిపించే చిరపరిచిత స్వరంగా మారింది. సత్యవతి చౌహాన్‌ అంటే తెలియని వారుంటారేమో గానీ మంగ్లీ అంటే తెలియని సంగీతాభిమానులుండరు. తెలుగువారి అచ్చమెన పండుగ సంక్రాంతి రోజున తెలుగు పాటల పండుగ మంగ్లీని పలకరించినప్పుడు ఆమె పంచుకున్న జీవితానుభవాల మాలిక ఇది...ఆ విశేషాలు... ఆమె మాటల్లోనే...

సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్లపోటీలకు వెళుతుండే. నెల రోజుల ముందుగానే ముగ్గుల కోసం బాగా ప్రిపేరయేదాన్ని, చుక్కలు ప్రాక్టీస్‌ చేస్తుండేదాన్ని. తెల్లవారు ఝామునే లేచి చలిలో ముగ్గులు వేయడం ఎంత వెచ్చని జ్ఞాపకమో. పండుగ దుస్తుల్లో మెరిసిపోతూ అమ్మాయిలమందరం కలిసి వేప చెట్టుకు తాడు కట్టుకుని ఊయలు లూగేవాళ్లం. మా ఇళ్లలో ఈ పండుగకు పిండి వంటలు స్పెషల్‌... నువ్వులతో చేసే సిరిపిండి... ముగ్గులు, సద్దల స్వీట్‌...  కజ్జికాయలు ఇవన్నీ బాగా ఎంజాయ్‌ చేస్తాం. 

పండుగలు అంటే అవి మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు  వాటిని ఆస్వాదించాలి.. ఆ జ్ఞాపకాలను తలచుకోవాలి అందరితో పంచుకోవాలి... అందుకే ఈ పండుగ పాటల ట్రెండ్‌కు నేనే శ్రీకారం చుట్టాను. సంక్రాంతి అంటే అర్ధం పరమార్ధం  మొత్తం తెలిసేలా.. స్వర్గీయ కందికొండన్న రాసిన భోగి మంట భాగ్యం, వెచ్చనైన రాగంతో సంక్రాంతి పాటలు మొదలుపెట్టాను. ఆ పాటకు వచ్చిన ఆదరణతో ఆ తర్వాత కూడా పలు సంక్రాంతి పాటలు పాడాను. రంగుల పుట్టిల్లు, తెలుగు లోగిళ్లు.  హేమంత మంచులో సూరీడు... పాటల్లో వాడ వాడలా సంక్రాంతి వేడుకలు భీమవరంలో పండుగ సందడి మొత్తం కనిపిస్తుంది.

నా వేదిక యూట్యూబ్‌
క్లాసికల్‌ సంగీతం, క్లాసికల్‌ డ్యాన్స్ వచ్చి కూడా నేను యాంకర్‌ గా మిగిలిపోవడం బాధగా ఉండేది. పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్లని కలవడం ఎలాగో తెలీదు. ఆ  సమయంలో యూ ట్యూబ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇండిపెండెంట్‌æసింగర్‌గా 2017లో యూ ట్యూబ్‌ లో పోస్ట్‌ చేసిన ‘రేలా.. రేలారే...’ పాట సూపర్‌ హిట్‌ అయి యాంకర్‌ మంగ్లి సింగర్‌ మంగ్లిగా ప్రపంచానికి తెలిసింది.  ‘తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి.. ’ బతుకమ్మ పాట కూడా దుమ్ము రేపింది. 

ఆ తర్వాత ‘ఎండికొండలేలేటోడా... నర్సపెల్లె’ ...ఇలా ఒక్కో పాట ఒక్కో మెట్టుగా మారి నా ఎదుగుదలకు నిచ్చెన వేశాయి. ఇక పండుగ పాటల ట్రెండ్‌కి ఊపునిస్తూ సాగిన ప్రతీ పాటా హిట్టే. కంది కొండన్న రాసిన సమ్మక్క సారక్క సాంగ్‌ వింటే వేరే పుస్తకాలు కూడా చదవనక్కర్లేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి.   శైలజా రెడ్డి అల్లుడు, జార్జిరెడ్డి సినిమాలలో పాడాను. ఇక రాములో రాములా... పాట నన్ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. ఆ తర్వాత సారంగదరియా.. రా రా రక్కమ్మ... ఇలా ఒకటొకటిగా నా హిట్‌ ఖాతాలో పడుతూ నన్ను నిలబెట్టాయి.

సింగర్‌... ఆల్‌రౌండర్‌...
శివుని పాటలు ప్రతియేటా చేయాలని.. చేస్తూ వస్తున్నా.   కేదార్‌నాద్‌లో డంగురు డంగురు శివ సాంగ్, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో చేశాం. వంద మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కాశీలో  ‘సాధు జంగమ.. ’పాటను చిత్రీకరించాం.  ఈషా ఫౌండేషన్  వాళ్ల ఆహ్వానం మేరకు 2022లో ఆ వేదిక మీద తొలిసారి పాడాను. ఆ«ధ్యాత్మిక గీతాలతోనే పుట్టి పెరిగినా, ఎదిగినా.. ఏదో ఒక శైలికి పరిమితం కాకుండా అన్ని రకాల పాటలూ పాడాలనేది నా లక్ష్యం. గ్రామీణంలో ఉన్న జానపదాన్ని గ్లోబల్‌ వైజ్‌గా తీసుకెళ్లాను. సంగీత దిగ్గజాలు సలీం సులేమాన్ , విజయ్‌ప్రకాశ్, ఉషా ఉతప్, సుధా రఘునాథన్ , ఎ.ఆర్‌.రెహ్మాన్ తో కలిసి పనిచేశాను.  ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ ప్రోగ్రామ్‌లో పాడటం ఎప్పటికీ మర్చిపోలేను.

లక్ష్యాలు ఇవే...
విదేశాలలో మా సంస్కృతీ సంప్రదాయాలకు గుర్తింపు తెచ్చేలా మా కమ్యూనిటీ కల్చర్‌ డ్రెస్‌ వేసుకుని  ధరించి పాటలు పాడాను. ఫోక్‌ సాంగ్స్‌కి సంబంధించి ఒక ఫార్మాట్‌ చేయాలని, మా బంజారా కమ్యూనిటీ కల్చర్‌ని విశ్వవ్యాప్తం చేయాలని...ఆశ.  గుజరాత్, రాజస్థాన్, మరాఠా .. బంజారాల మీద సాంగ్స్‌ ఇంకా చేయాలని ఉంది. భవిష్యత్తులో నాకు వచ్చిన విద్యను నేర్పించాలని ఉంది. నేను నేర్చుకున్న కర్నాటిక్‌ శాస్త్రీయ సంగీతంతో  కచేరీలు చేయాలని ఉన్నది. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, పురంధర దాసుల వంటి మహామహుల కీర్తనలను నా గొంతుతో రికార్డు చేయాలనుంది. 
 

అందుకున్న పురస్కారాలు...
∙సంగీత్‌ నాటక్‌ అకాడమీ వారి ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కార్‌
∙ఐఫా, సైమా, గామా..లలో బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌

పాట... మా సంస్కృతి
మాది ఒక బంజారా వ్యవసాయ కుటుంబం. పాటలు పాడటం మా బంజారా సంస్కృతి, జీవనంలో మమేకమై ఉంటుంది. ప్రకృతే మాకు పాటలు నేర్పిస్తుంది. మాలో చదువుకున్నవారికి తప్ప ఎవరికీ తెలుగు భాష సరిగా రాదు. నాలోని గాయనిని మా నాన్న తర్వాత గుర్తించింది మా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఫాదర్‌ విన్సెంట్, బృందం.. ప్రతి గ్రామం నుంచి ఎవరెవరిలో ఏయే ప్రతిభ ఉంది... అనేది పరిశీలించి ప్రోత్సహించేవారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అలా నన్ను కూడా వాళ్లే గుర్తించి పాటలు నేర్పించి తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్‌ కాలేజీలో జాయిన్  చేశారు. అప్పుడే సిటీ స్కూల్లో మ్యూజిక్‌ క్లాసులు, డ్యాన్స్ నేర్పితే డబ్బులు వస్తాయని మా సీనియర్స్‌ పిలవడంతో హైదరాబాద్‌కి 2013లో వచ్చాను. ఆ సమయంలోనే వి 6 చానల్‌లో పొలిటికల్‌ సెటైర్‌ ప్రోగ్రామ్‌ మాటకారి మంగ్లీతో నేను మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యాను. ఆ ప్రోగ్రామ్‌లో అప్పుడప్పుడు పాటలు పాడి సింగర్‌గా తృప్తిపడేదాన్ని.

– సత్యబాబు, సాక్షి సిటీలైఫ్‌ ప్రతినిధి

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)