Breaking News

ఫోటో సరదా ప్రాణం తీసింది : కాబోయే భార్య కళ్లముందే విషాదం!

Published on Thu, 07/11/2024 - 13:18

దక్షిణాఫ్రికాలోని ఒక నేషనల్ పార్క్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్పానిష్ పర్యాటకుడు ఒకరు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలయ్యాడు. పిలాన్స్‌బర్గ్ జాతీయ ఉద్యానవనానికి సఫారీకి వెళ్లిన సందర్భంగా ఆదివారం  ఈ ఘటన జరిగింది.

అధికారుల సమాచారం ప్రకారం 43 ఏళ్ల స్పానిష్‌ టూరిస్ట్‌ తన కాబోయే భార్య, మరో ఇద్దరితో కలిసి జాతీయ ఉద్యానవనంలో విహరి స్తున్నాడు. ఇంతలో ఏనుగుల గుంపును చూసిన అతడు వాహనం నుంచి బయటికి వచ్చి  మరీ ఫోటోలు తీయాలని సరదా పడ్డాడు. అంతే ఒక్కసారిగా మూడు పెద్ద ఏనుగులు దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన  పిల్ల ఏనుగులకు హాని చేస్తున్నాడనే ఆగ్రహంతోనే పెద్ద ఏనుగు దాడికి దిగిందని, దీంతో మిగతావి కూడా ఎటాక్‌ చేశాయని పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపారు.  

రెండు ఇతర వాహనాలలో ఉన్నతోటి పర్యాటకులు హెచ్చరించినప్పటికీ , పట్టించు కోలేదని,  దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని  నార్త్ వెస్ట్ పార్క్స్, టూరిజం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఉండే అడవి జంతువుల దగ్గరకు వెళ్లకూడదనీ, వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం చేసినా, సెల్ఫీలు తీసుకున్నా, ప్రమాదానికి  దారితీస్తాయని స్థానికులు వెల్లడించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)