Breaking News

హైహిల్స్‌తో రన్నింగ్‌ చేసి..గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు!

Published on Sat, 06/24/2023 - 16:31

పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్‌ రికార్డ్‌ బ్రేకర్‌ క్రిస్టియన్‌ రాబర్టో లోపేజ్‌ రోడ్రిగ్జ్‌ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్‌ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు.

గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్‌. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్‌ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు.

రోడ్రిగ్జ్‌ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు.  

(చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ ఆర్డర్‌ పెడితే..ఏకంగా..)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)