Breaking News

బొద్దింకను చంపబోయి.. ఏకంగా ఇంటినే తగలబెట్టాడు

Published on Sat, 12/16/2023 - 14:00

రాజమౌళి ఈగ సినిమా గుర్తుంది కదా.. అందులో విలన్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చివరకు ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు‌. సరిగ్గా ఇలాంటి సీన్‌ జపాన్‌లో రిపీట్‌ అయ్యింది. బొద్దింకను చంపే ప్రయత్నంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటిని తగటబెట్టాడు.

ఏమైందంటే.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి బొద్దింక చొరబడింది. దీంతో ఎలాగైనా దాని భరతం పడదామని, పెద్ద మొత్తంలో బొద్దింకల్ని చంపే స్ప్రేను పిచికారీ చేశాడు. అంతే సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. ఒక్కసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై స్పై చేయడంతో మంటలు చెలరేగాయి.

ఈ ధాటికి అపార్ట్‌మెంట్‌ మొత్తం మంటలు వ్యాపించగా, సదరు వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు.  ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌ల దగ్గర పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది. పిచికారీ స్ప్రేలల్లో ప్రొపేన్, బ్యూటేన్‌తో పాటు ఆల్కహాల్‌ వంటి మండే స్వభావం ఉన్న ప్రొపెల్లెంట్‌లు ఉంటాయని, వీటి వల్ల ఒక్కోసారి ఇలా పేలుడు జరిగే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)