Breaking News

నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Sat, 03/23/2024 - 11:47

చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ  మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినికి చెందిన  ఒక వ్యక్తి అక్షరాలా  దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృత‌జ్ఞ‌తతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినికి చెందిన రౌన‌క్ గుర్జార్ ఒక‌ప్పుడు రౌడీ షీట‌ర్. త‌న చ‌ర్మంతో త‌న త‌ల్లికి చెప్పులు త‌యారు చేయించి బ‌హుమానంగా ఇచ్చాడు.  అదీ రామాయ‌ణం స్ఫూర్తితో. రామాయ‌ణంలో శ్రీరాముడు త‌న త‌ల్లి ప‌ట్ల చూపిన భ‌క్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌన‌క్. తాను కూడా అమ్మకోసం ఏదైనా  చేయాలనుకున్నాడు.

అందుకోసం ఏకంగా  కుటుంబంలో ఎవ‌రికీ తెలియ‌కుండా ఓ ఆస్ప‌త్రిలో స‌ర్జ‌రీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చ‌ర్మాన్ని తొల‌గించి, దానితో త‌ల్లికి స‌రిపోయేలా ఆ చ‌ర్మంతో చెప్పులు త‌యారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భ‌గ‌వ‌త్ క‌థ‌లో రౌన‌క్ త‌న త‌ల్లికి ఆ చెప్పులు స‌మ‌ర్పించి తల్లి పాదాలపై  మోకరిల్లాడు.  దీంతో రౌన‌క్ త‌ల్లితో పాటు గురు జితేంద్ర మ‌హారాజ్  కూడా భావోద్వేగానికి లోనయ్యారు.  అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌన‌క్ క్ర‌మం త‌ప్ప‌కుండా రామాయ‌ణం పారాయ‌ణం చేస్తాడట.  ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. 

తన చ‌ర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడ‌ని ఊహించ‌లేద‌ంటూ  రౌన‌క్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం  అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)