Breaking News

‘ఆయన దేవుడు’ వీరాభిమాని గుండెలపై శాశ్వతంగా రతన్‌ టాటా

Published on Wed, 10/16/2024 - 11:37

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్‌ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని  చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.

రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను  టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్,  ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.  ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది.   రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు.  ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన   స్నేహితడు వైద్యం కోసం  ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్  ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.

దీంతో  ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్‌, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు.  ఈ వీడియో  లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా  వ్యూస్‌ను సాధించింది. 

కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)