Breaking News

నాకు సూపర్‌ పవర్స్‌ వస్తే..!

Published on Thu, 11/13/2025 - 08:51

బుల్లితెరపై ‘మల్లి’ సీరియల్‌తో, వెండితెరపై ‘రాబిన్‌  హుడ్‌’ సినిమాతో పాపులర్‌ అయింది బేబీ శాన్వీ పటేల్‌. ‘రాబిన్‌ హుడ్‌’ సెట్‌లో హీరోయిన్‌  శ్రీలీల చేసిన సర్‌ప్రైజ్‌ గురించి, తనకు సూపర్‌ పవర్స్‌ వస్తే ఏం చేస్తుందో... ఇలా బోలెడన్ని కబుర్లు పంచుకుంది శాన్వీ.

  • ప్రస్తుతం నేను ఐదో క్లాస్‌ చదువుతున్నాను. హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాకు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్‌తో పాటు సింగింగ్, డ్రాయింగ్‌ కూడా వచ్చు. కూచిపూడి డ్యాడ్స్‌ నేర్చుకుంటున్నాను. అలాగే చదువుపై కూడా శ్రద్ధ ఉంది. స్టడీస్‌ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒకవైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాలు చేయడం నాకేం ఇబ్బంది లేదు. మా అమ్మ సహాయంతో బ్యాలెడ్స్‌ చేసుకుంటున్నాను. సింగింగ్, డ్రాయింగ్‌లలో నాకు స్కిల్స్‌ ఉన్నప్పటికీ యాక్టింగ్‌ అంటేనే ఇష్టం. భవిష్యత్‌లోనూ యాక్టింగ్‌ని కంటిన్యూ చేస్తూనే స్టడీస్‌ని పూర్తి చేస్తాను.

  • జవహర్‌లాల్‌ నెహ్రూగారి జయంతిని మనం చిల్డ్రడ్స్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటామని నాకు తెలుసు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. టీచర్స్‌ డే, చిల్డ్రడ్స్‌ డేలను మా స్కూల్లో బాగా సెలబ్రేట్‌ చేస్తారు. మా క్లాస్‌లో ఉన్న బెంచ్‌లన్నింటినీ తీసేసి, మా టీచర్‌ గైడెడ్స్‌తో అక్కడ కేక్‌ కట్‌ చేస్తాం. అలాగే అక్కడ కొన్ని సాంగ్స్‌కు సింగిల్‌గా, గ్రూప్‌గా డ్యాడ్స్‌ కూడా చేస్తాం. బర్త్‌ డేలను మనం ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటామో అలా చిల్డ్రడ్స్‌ డేని సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఈ ఏడాది చిల్డ్రడ్స్‌ డేకి డ్యాన్సింగ్, సింగింగ్‌ పోటీల్లో పాల్గొంటున్నాను. మా స్కూల్లో టీచర్స్‌ అందరూ నాకు ఇష్టమే. ముఖ్యంగా నాకు మా తెలుగు టీచర్‌ లావణ్య మేడమ్, సైడ్స్‌ టీచర్‌ నవ్య మేడమ్‌ అంటే చాలా ఇష్టం.

  • నేను యాక్ట్‌ చేసిన ‘కలివి వనం’ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ అవుతోంది. అడవులను రక్షించుకోవాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు దర్శకుడు రాజ్‌ నరేంద్ర. ఇందులో నాగదుర్గ మేడమ్‌తో కలిసి నటించాను. నాతో పాటుగా మరో నలుగురు చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేశారు. సెట్స్‌లో మేం అందరం చాలా సరదాగా ఉండేవాళ్లం. మనమందరం అడవులను కాపాడుకోవాలి. సేవ్‌ ఫారెస్ట్స్‌... సేవ్‌ లైఫ్స్‌. నేను రెండు మొక్కలు నాటాను. ప్రతిరోజూ వాటికి నీళ్లు పోస్తాను. ఈ మొక్కల సంరక్షణను నేనే చూసుకుంటాను.

  • తెలుగు హీరోస్‌లో ప్రభాస్, అల్లు అర్జున్‌ గార్లు అంటే ఇష్టం. హీరో యిన్స్‌లో శ్రీలీల, నాగదుర్గ మేడమ్స్‌ ఇష్టం. శ్రీలీలగారు హీరోయిన్‌ గా చేసిన ‘రాబిన్‌ హుడ్‌’లో నేను యాక్ట్‌ చేశాను. త్రీ డేస్‌ ముందు నా బర్త్‌ డే గురించి చె΄్పాను. నా ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిపించి, సర్‌ప్రైజ్‌గా నా బర్త్‌ డేని సెలబ్రేట్‌ చేశారు శ్రీలీల మేడమ్‌. నేను సూపర్‌ హీరో సినిమాలూ చూస్తుంటాను. నాకు సూపర్‌ పవర్స్‌ వస్తే... సినిమాల్లో హీరోలు చేసినట్లుగా నేనూ మంచి పనులకే ఆ పవర్స్‌ని వాడతాను. నా ఫేవరెట్‌ కలర్‌ సిక్స్‌. సో... నాకు సిక్స్‌ కలర్స్‌ అంటే ఇష్టం. పింక్, పర్పుల్, బ్లాక్, మెరూన్, గ్రే వంటివి ఇష్టం.

  • ఇప్పుడు ఇంద్రజ మేడమ్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆమె కూతురు పాత్రలో నటిస్తున్నాను. ‘మల్లి’ సీరియల్‌లో మల్లిక క్యారెక్టర్‌ చేశాను. నేను నటించిన మరికొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. పిల్లల గురించి వచ్చే సినిమాలు, సందేశం ఇచ్చే సినిమాలంటే నాకు ఇష్టం. ఫైటింగ్‌ సినిమాలన్నా కూడా ఇష్టమే.
    – ముసిమి శివాంజనేయులు

 

– 

#

Tags : 1

Videos

Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...

Global Silence: 8 లక్షల మంది బలి

Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు

విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య

అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు

పవన్ కల్యాణ్‌కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)