Breaking News

అరిసెలే కాదు ఉంధియు, తిల్ పిఠా కూడా!

Published on Thu, 01/15/2026 - 07:20

పంట చేతికి అందివచ్చిన నేపథ్యంలో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగను వివిధ రకాల పిండి వంటకాలతో జరుపుకుంటారు. ఆ యా ప్రాంతాలను అనుసరించి చేసే వంటకాలు రుచికరంగానే కాదు..ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరి ఆయా ప్రాంతాల నోరూరించి వంటకాల రకాలు చూద్దామా..!.

సంక్రాంతి వచ్చేస్తోందంటే..భారతదేశం అతటా వంటశాలలన్నీ...సందడిగా మారిపోతుంటాయి. రుచికరమైన పిండి వంటకాలతో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ల నుంచి ఉత్తర భారతదేశం వరకు ఆయా స్థానిక విభిన్న వంటకాలన్ని అక్కడ జరుపుకునే పండుగకు అర్థమిచ్చేలా అత్యంత మధురంగా ఉంటాయి. 

ఒకే పండుగ ప్రదేశాన్ని బట్టి జరుపుకునే విధానం వేరుగా ఉన్నట్లే.. వండే వంటకాలు సైతం వేర్వేరుగా ఉంటాయి. సంక్రాంతి రోజున తమిళనాడులో పొంగిపొర్లే బియ్యంతో పొంగల్. గుజరాత్‌లో గాలిపటాలు, ఉంధియు, బీహార్‌లో, భారీ కుండలలో వండిన కిచిడీ వంటి పంసందైన వంటకాల జాబితా చాలానే ఉంది. కాబట్టి ప్రాంతాల వారికి ఆ రోజు చేసే వంటాకాలను గురించి సవివరంగా చూద్దామా..!.

కిచిడీ – ఉత్తరప్రదేశ్ బీహార్
తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్‌లో, సంక్రాంతి కిచిడీ చుట్టూ తిరుగుతుంది. దీనిలో ఉపయోగించే బియ్యం, పప్పులు, నెయ్యి, కాలానుగుణ కూరగాయలు – పండుగ సారాంశాన్ని తెలియజేసే సాధారణ పదార్థాలు. దీనిని భారీ పరిమాణంలో వండి, దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించి, ఆపై ప్రసాదంగా పంచుతారు. ఇది అన్నం ప్రాధాన్యతను తెలియజేసేలా వండే వంటకం, మంచి పౌష్టికరం కూడా. 

నువ్వుల లడ్డూ – బీహార్ & జార్ఖండ్
బీహార్, జార్ఖండ్‌లో సంక్రాంతి సమయంలో నువ్వులు బెల్లంతో చేసిన స్వీట్లు ఆధిపత్యం చెలాయిస్తాయి. నువ్వుల లడ్డూలను ప్రత్యేకంగా ఈ సమయం తయారు చేస్తారు. వేయించిన నువ్వులను బెల్లంతో కలిపి ముద్దగా అయ్యే వరకు కలుపుతారు. ఈ కలయిక కేవలం రుచికరమైనది మాత్రమే కాదు – ఇది ప్రయోజనకరమైనది కూడా. ఈ రెండు పదార్థాలు వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది తీవ్రమైన చలికాలంలో చాలా ముఖ్యం. 

ఉంధియు – గుజరాత్
గుజరాత్‌లో ఉత్తరాయణం అంటే ఆకాశంలో గాలిపటాలు, బల్లపై ఉంధియు అని అర్థం. నెమ్మదిగా వండే మిశ్రమ కూరగాయల వంటకం. శీతాకాలంలో లభించే ప్రతిదాన్ని ఉపయోగిస్తూ తయారు చేస్తారు. సాధారణంగా పూరీ, జిలేబీతో కలిపి తింటే దాని టేస్ట్‌ వేరేలెవెల్‌. 

​గుర్ కి రోటీ  పంజాబ్, హర్యానా
పంజాబ్, హర్యానాలలో సంక్రాంతి అంతా కరిగించిన బెల్లంతో తియ్యగా చేసిన గోధుమ ఫ్లాట్‌బ్రెడ్‌లను తెల్ల వెన్న లేదా నెయ్యితో తింటారు. ఇవి శీతాకాలంలో వెచ్చదనం, శక్తిని అందించడానికి ఉద్దేశించిన గ్రామీణ, సరళమైన ఆహారం ఇది. ఇక్కడ ధాన్యం పంటగా గోధుమల గౌరవార్థం బెల్లంతో కలిపి వివిధ పిండివంటలు చేసుకుంటారు ప్రజలు. 

అరిసెలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
అరిసెలు శ్రమతో కూడుకున్నది, అందుకే ఇది సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు అత్యంత స్పెషల్‌ వంటకం. బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో కలిపి చాలా శ్రమతో వండే వంటకం ఇది.  ఇది ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కలిసి చేసే వంటకం. అంతా జోక్స్‌ వేసుకుంటూ సరదసరదాగా వండే వంటకం కూడా. ఇది రుచిని, బంధాలను బలపర్చుకునేలా చేసే తీపి వంటకం

తిల్ పిఠా - అస్సాం,పశ్చిమ బెంగాల్
అస్సాంలో, సంక్రాంతి మాఘమేళతో సాగే వేడుక ఇది. ఈ సమయంలో నువ్వులు, బెల్లం నింపిన తెల్లటి అట్టుతో చేసే తిల్‌ పిఠా చాలా ప్రాచుర్యం పొందింది. 

చివరగా బియ్యం ఆధారిత స్వీట్లు..ఆయా ప్రాంతా పండిన పంటకు కృతజ్ఞతతోపాటు సాంప్రదాయ వంట పద్ధతులు ఇప్పటికీ మాలో భాగం చెప్పేలా హైలేట్‌ చేస్తోంది ఈపండుగ. ముఖ్యంగా కాలనుగుణంగా వండే ఈ వంటకాలు..శరీరానికి వెచ్చదనంతోపాటు..మంచి ఆరోగ్యాన్ని అందించే పసందైన వంటకాలు కూడా. 

(చదవండి: భోగికి దూరంగా బూరవిల్లి గ్రామం)

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు