Breaking News

ఆభరణాల క్రియేటివిటీలో సరికొత్త ట్రెండ్‌..!

Published on Tue, 04/29/2025 - 10:10

ఆభరణం అంటే మగువల అందాన్ని పెంచడానికి విభిన్న సృజనాత్మక రూపాల్లో తయారు చేయడమే. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో ఆభరణాల ప్రపంచంలో ఒక కొత్త ధోరణి చెలామణి అవుతోంది. ‘థీమ్‌ ఆధారిత ఆభరణాలు’ అనే ఈ ట్రెండ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్‌ నగరంలో కూడా ఇది విస్తృతంగా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ప్రకృతి, ఋతువుల సౌందర్యానికి ప్రతిగా రూపొందించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ప్రముఖ ఆభరణ బ్రాండ్లు ఈ కొత్త ధోరణిని స్వీకరించి, ప్రతి ఆభరణంలోనూ ప్రకృతి సౌందర్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్‌లు ప్రత్యేకంగా రూపొందించిన కళాఖండాలు, కశ్మీర్‌ ఋతువుల మాయాజాలాన్ని ప్రతిబింబిస్తూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. అది బంగారమా, వజ్రమా అనే తేడా లేకుండా వ్యాపార విలువతో పాటు ఆభరణంలోని థీమ్‌ను, వైవిధ్యాన్ని, వినూతనత్వాన్ని ఆస్వాదిస్తున్నారు నగరవాసులు.  

ఆభరణాల తయారీలోని హస్తకళ వైవిధ్యానికి థీమ్‌ ఆధారిత జ్యువెలరీ మరింత హంగులను అద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆభరణ సౌందర్యాలు. ఋతువుల కవిత్వం తాకిన కళ.. ‘ఈ లోయ గుండా నడిచిన ప్రతిసారీ, ఋతువులు తమ పాటలు పాడతాయి’ అనే భావనతో ఒక కవిత్వ సృష్టిలాంటి ఆభరణాలు అలరిస్తున్నాయి. 

చినార్‌ ఆకుల నృత్యం నుంచి మంచుతో కప్పబడిన పైన్‌ చెట్ల పరవశం వరకూ ప్రతి ఆభరణం ప్రకృతి గాథను చెబుతోంది. శరదృతువులో చినార్‌ ఆకులు గాలిలో ఊగే తీరు, తెల్లటి మంచుతో అలంకరించిన దృశ్యాలను ప్రతిబింబించే చెవిపోగులు, లాకెట్లు, రౌండ్‌ కట్‌లో తెల్ల వజ్రాలతో తయారైన కశీ్మర్‌ శీతాకాలపు నిర్మలత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.  

ప్రకృతిని ధరించే సోయగాలు.. 
ఈ కొత్త థీమ్‌ ఆధారిత ఆభరణాలు ప్రకృతిని మించిన అందాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఋతువుల స్వభావాన్ని, కశీ్మర్‌ వంటి సుందర ప్రదేశాలను ప్రతిబింబించేలా తయారు చేస్తున్న ఆభరణాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. అధునాతన సంప్రదాయానికి వినూతనత్వాన్ని జోడిస్తున్న ఈ కళాఖండాలు ప్రస్తుత జీవన శైలి, ఫ్యాషన్‌ ప్రపంచానికి ప్రకృతితో కూడిన కొత్త పంథాను పరిచయం చేస్తున్నాయి. 

శీతాకాలపు అందాల్లో మునిగిపోయిన పైన్‌ చెట్లు, కిరణాలపై మెరిసే వజ్రాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన నెక్లెస్‌లు, చెవిపోగులు శీతాకాలపు సౌందర్యానికి నిదర్శనంగా తయారు చేస్తున్నారు. నెమ్మదిగా వెలిసే శీతాకాలం మొదలు వికసించే వసంతానికి మధ్య మార్పును చూపించే ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

వసంతపు వర్ణ విహారం.. 
వసంత ఋతువులో కశీ్మర్‌ లోయను అలంకరించే తులిప్‌ పువ్వుల కాంతిని పసుపు వజ్రాలు, గులాబీ క్వార్‌ట్ట్జ రత్నాలతో తయారు చేసినట్టుగా ప్రతిబింబిస్తున్నాయి. తులిప్‌ పువ్వుల వర్ణాలను దృశ్యాన్ని చేస్తున్నట్లుగా చెవిపోగులు, నెక్లెస్‌లు ప్రతి రూపంలో ప్రకృతి ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. 

సృష్టి కథను ఆభరణాల్లో వర్ణిస్తూ.. 
‘ఇప్పటికీ మిగిలి ఉన్న స్వర్గం’ అనే భావన ఆధారంగా రూపొందించిన ఈ కొన్ని కలెక్షన్‌ కశీ్మర్‌ లోయల శాశ్వత అందాన్ని మిళితం చేస్తూ అందమైన కథగా చెబుతున్నాయి. బంగారం పై తయారు చేసిన చినార్‌ ఆకులు, వజ్రాల కాంతిలో మెరిసే తులిప్‌ పువ్వులు, కాలానికి అర్థం చెప్పకనే చెబుతున్నాయి. 

మై ఎంబ్రేస్‌.. మగువల ఆలోచనలు.. 
ప్రస్తుత తరుణంలో ఆభరణాలను అందం కోసమే కాకుండా ఒక కళాత్మక జీవనానికి నిదర్శనంగా ధరిస్తున్నారు మగువలు. దీనికి అనుగుణంగానే ఆభరణాల తయారీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే జోయా ఆధ్వర్యంలో మై ఎంబ్రేస్‌ అనే థీమ్‌తో.. సాధారణంగా మహిళలు జీవితంలో ఎన్ని పాత్రలు పోషించినా, వారి జీవితానికి పరమార్థంగా ‘తనను తాను ఆలింగనం చేసుకునేలా’ అందమైన జ్యువెలరీ రూపొందించాం. 

మగువ ఆలోచనలు, ఆనందాలు సార్థకం అయ్యేలా తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకునేలా సృష్టించిన ఈ ఆభరణాలు నగరంలోని జ్యువెల్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.  – అమన్‌ప్రీత్‌ అహ్లువాలియా, జోయా బిజినెస్‌ హెడ్‌ 

(చదవండి: ఖాదీ కమ్‌ బ్యాక్‌)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)