Breaking News

కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్‌ వస్తుందా? రాదా?

Published on Wed, 04/23/2025 - 09:48

నేను ఒక ప్రైవేట్‌ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్‌ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్‌కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా?  - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్‌

హెచ్‌.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్‌కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా  మెయింటెనెన్స్‌ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత  మెయింటెనెన్స్‌స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్‌ వస్తుంది. సెక్షన్‌ 144 బీఎన్‌ఎస్‌ ( పా సీ.ఆర్‌.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి.
 

నాకు, నా మూడేళ్ల కొడుకుకి  మెయింటెనెన్స్‌ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్‌ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు 


మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్‌ చట్టం లోని సెక్షన్‌ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్‌ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. 

– శ్రీకాంత్‌ చింతల
హైకోర్టు న్యాయవాది
 

మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్‌ చేయ వచ్చు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)