Breaking News

మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!

Published on Thu, 07/25/2024 - 07:44

అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్‌తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్‌ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్‌ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్‌ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..

‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్‌ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ ఖాళీ టైమ్‌లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.

కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్‌ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్‌మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్‌టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్‌రెడ్డితో΄ాటు ఏఎన్‌ఆర్‌ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.

కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్‌తో మొదలు ఉత్తరప్రదేశ్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్‌కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి