Mahashivratri 2026: శివపూజకు దినుసులు

Published on Sat, 02/14/2026 - 18:33

ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. 

ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.

అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్‌ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్‌ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్‌ సేయగా ధన్యుడౌ,/... తుదిన్‌ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! 

 - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి)

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)