Breaking News

Mahakumbh Mela 2025 పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం!

Published on Mon, 01/27/2025 - 17:32

మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమారంభం. ఎందరో సాధువులు, బాబాలు, అవధూతలు, సిద్ధులు, యోగులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా హైందవ ధర్మంలో ఉన్న అనేక ఆచారాలకు సంబంధించిన ఎందరో మహిమాన్వితులు మహాకుంభ మేళాకు తరలి వెళతారు. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు ఆ దివ్య మహోత్సవ సందర్శనార్థం ప్రయాగ చేరుకుంటారు. నదులకు సహజ సిద్ధంగా దివ్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే ఎన్నో దివ్య క్షేత్రాలు, ధామాలు పుణ్యనదుల పరీవాహక  ప్రాంతాల్లో కొలువుదీరి ఉంటాయి. ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. 

భూమాతను ఆసురీ శక్తుల ప్రభావం నుండి కాపాడేందుకు, దివ్యశక్తిని పెంచేందుకు ఎందరో యోగులు, సిద్ధులు, గురువులు ప్రత్యక్ష, పరోక్ష రూ΄ాలతో కృషి చేస్తుంటారు. మహా కుంభమేళా సమయంలో ఎందరో సాధువులు, మహా యోగులు నదీ గర్భంలోకి తమ త΄ోశక్తులను కూడా ప్రవహింపచేసి, అక్కడికి వచ్చిన అనేక మంది భక్తులను అనుగ్రహిస్తారు. నదిలోని దివ్య శక్తి, విశ్వంలో గ్రహాల అమరిక వల్ల ఉత్పన్నమయ్యే విశ్వశక్తి, మహాయోగుల తపోశక్తి వెరసి, దివ్య ప్రకంపనలు భూ గ్రహమంతా విస్తరిస్తాయి. అక్కడికి చేరుకున్న వ్యక్తులకే కాకుండా, ఈ దివ్య ప్రకంపనలు సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. 

యోగవిద్యలో చెప్పిన ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు, ప్రయాగరాజ్‌ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల కలయికకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద మూడు పుణ్యనదులు కలిసి ఒక పవిత్ర తీర్థంగా మారినట్లే, మానవుడిలో ఇడా, పింగళ సుషుమ్న నాడులు భృకుటీ మధ్య భాగంలో సంగమిస్తాయి. అందుకే బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని జ్ఞాన త్రివేణిగా అభివర్ణిస్తారు. ఈ మూడు నాడులు ఏకీకృతం అయినప్పుడు చైతన్య జాగృతి కలుగుతుంది. అందుకే భకుటీ మధ్యంలో గంధం, కుంకుమ, పసుపు లేదా భస్మాన్ని బొట్టుగా ధరిస్తారు. భ్రూ మధ్యంలో మూడు నాడుల కలయిక అన్నది యోగంలో చెప్పే అమృతత్వ స్థితిని ప్రదానం చేసేందుకు మార్గం అవుతుంది. 

ఈ సంవత్సరం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగే ఈపవిత్ర సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మనసును క్లేశ రహితంగా మార్చుకోవడం వల్ల దివ్య శక్తిని ఎక్కడ ఉన్నా పొందవచ్చు. త్రివేణి సంగమ స్థలికి చేరుకోలేని వారు, ఇంటి వద్దే 45 రోజుల పాటు ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా అమృతతత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. 
– మాతా ఆనందమయి,ఆధ్యాత్మిక గురువు 
చదవండి: రూ. కోటి జాబ్‌ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో


 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)