Breaking News

Maha Kumbh Mela : సింపుల్‌గా, హుందాగా రాధిక-అనంత్‌ అంబానీ జంట

Published on Wed, 02/12/2025 - 13:41

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో  అంబానీ కుటుంబంకూడా చేరింది.  ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్‌ అంబానీ, అతని భార్య  శ్లోకా మెహతాతో పాటు,  అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్‌ : థ్రిల్లింగ్‌ డబుల్‌ డెక్కర్‌ బస్‌, గుండె గుభిల్లే! వైరల్‌ వీడియో)

మహా కుంభ్‌లో, రాధిక తన లుక్‌తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్  లగ్జరీ  కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్‌ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల  విలువ ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. V-నెక్‌లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్‌లు నెక్‌లైన్  బోర్డర్‌లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు.  ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్‌ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ  తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్‌గా ఉండటం విశేషం. సింపుల్‌ పోనీటైల్‌తో డైమండ్ స్టడ్ చెవిపోగులు,  హారాన్ని ధరించి  ఆధ్యాత్మిక లుక్‌లో అలరించింది. (Valentines Day : లవ్‌ బర్డ్స్‌కోసం ది బెస్ట్‌ డెస్టినేషన్‌ ఇదే!)

ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు.  వెండి మోటిఫ్‌లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్‌కోట్‌,  షైనింగ్‌ రెడ్‌ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు.

 కాగా  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది.   సూర్యుని చుట్టూ బృహస్పతి   చుట్టే కక్ష్య పూర్తైన  సూచనగా జరుపుకునే ముఖ్యమైన  తీర్థయాత్ర పండుగ ఇది.   12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు  సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)