Breaking News

చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు

Published on Fri, 11/08/2024 - 09:56

‘కేజీఎఫ్‌’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్‌’లో పెద్ద విలన్‌లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....

‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.
‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.

మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న  ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.

ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్‌ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. 

ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్‌ శర్మ. నిజానికి ఇది ప్రకాష్‌ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్‌: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్‌..!      

(చదవండి: ఆ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)