Breaking News

మన నేలమీదే రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్‌ స్టోరీ

Published on Wed, 03/20/2024 - 11:43

విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్‌ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్‌లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్‌ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది.

నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్‌. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్‌ దేశాల్లో పండే రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్‌బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్‌ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. 


 
హై బుష్‌ కౌన్సిల్‌ ప్రకటన!

‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్‌ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్‌ హైబుష్‌ బ్లూ బెర్రీ కౌన్సిల్‌ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం.  


 
దిగుబడికి ముందే ఆర్డర్‌లు! 
ఇంతకీ కేయాసాలోత్‌ అనతికాలంలోనే సక్సెస్‌ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్‌లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్‌బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది.

ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్‌ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్‌లకు సప్లయ్‌ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్‌లు వచ్చారు. 

రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్‌లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్‌ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్‌ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు.  32 ఏళ్ల కేయా సాలోత్‌ అనుసరించిన సక్సెస్‌ ఫార్ములా రైతులకు మార్గదర్శనం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)