Breaking News

ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?

Published on Sat, 09/02/2023 - 13:03

ఈ రెండూ లోబీపీకి ప్రధాన సూచన కావొచ్చు. తక్కువ ఆక్సిజన్‌ స్థాయి కారణంగా ఒక్కోసారి అపస్మారక స్థితి ఏర్పడవచ్చు. మెడ మీద గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఆగీ ఆగీ నొప్పి కూడా రావొచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏమిటంటే, శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లోబీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది.

లోబీపీ ఉంటే ఏం చేయాలి
లోబీపీ అకస్మాత్తుగా జరగదు. శరీరంలో ఏ సమస్య వచ్చినా బీపీ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్‌, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. శరీరంలోని ఏ భాగంలో అయినా మార్పులు సంభవిస్తే రక్తప్రసరణలో తేడా వచ్చి బీపీ పడిపోతుంది. మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడితో కూడిన జీవితం బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మధుమేహం వల్ల కూడా ఇది జరగవచ్చు. అలాంటప్పుడు తగిన చికిత్సను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి.  

(చదవండి: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)