Breaking News

అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు

Published on Mon, 11/04/2024 - 09:59

ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ  డాన్సెస్‌ ఆఫ్‌ ఇండియా సెయింట్‌ లూయిస్‌. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి  పాత్రను ’డ్రీమ్స్‌ ఆఫ్‌ ది డార్క్‌ ప్రిన్స్‌’ పేరుతో  నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే... 

‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ది డార్క్‌ ప్రిన్స్‌' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.

నాడు–నేడు
‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్‌ పుతిన్, ఉక్రెయిన్‌ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

 ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ది డార్క్‌ ప్రిన్స్‌‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్‌ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్‌ చేశారు.  

(చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్‌ వర్కౌట్స్‌ ఇవే!)

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)