Breaking News

సెకండ్‌ హ్యాండ్‌ సంపన్నులు!

Published on Tue, 01/21/2025 - 00:38

ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్‌లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్‌ సావెద్ర, అనీ కోల్‌... మిలియనీర్‌లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్‌ ఏంజిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్‌ హ్యాండ్‌ కారును ఉపయోగించుకుంటారు.

పిల్లలు సెకండ్‌హ్యాండ్‌ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్‌కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్‌ చూసి టెంప్ట్‌ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్‌ సావెద్ర.

రీసెర్చర్, పర్సనల్‌ ఫైనాన్స్‌ కోచ్‌ అనీ కోల్‌ మిలియనీర్‌. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్‌ హ్యాండ్‌ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)