Breaking News

ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం

Published on Fri, 09/06/2024 - 10:58

హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్‌ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు  ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.

ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్‌ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)