Breaking News

తొండ నృత్యం జిందాబాద్‌! 

Published on Fri, 08/07/2026 - 02:00

బండ మీద బస్కీలు చేస్తూ ఓ తొండ సుదీర్ఘంగా ఆలోచించసాగింది. ఈమధ్య అది మానవుల ప్రవర్తననూ, మనుషుల ఆలోచనారీతుల్నీ, మానవ సంకుచిత స్వభావాన్నీ  చాలా పరిశీలనగా చూస్తోంది. దాని ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. పాములు తమ శాస్త్రీయ నృత్యమైన ‘నాగిన్ డాన్స్’ చేస్తాయి. నెమళ్లూ తమ నృత్యరీతి ‘మయూరడాన్స్’ను పక్షినృత్యమంటూ కొనసాగిస్తాయి. మరి తొండలు పరిణమక్రమంలో చాలా పురాతనమైనవి కదా. ఎవల్యూషన్‌లో తమ కాళ్లు పోగొట్టుకున్నాయి కాబట్టి పాముల కంటే మా తొండలే పాతవి కదా. అవి కూడా బండ మీద బస్కీడాన్స్‌ చేస్తూ ఫ్రీగా ఫిట్‌నెస్‌ను పంచుతాయి కదా! కానీ... అకటా ఈ మనిషి ఎంతటి సంకుచితుడు!? ఎందుకంటే... 

‘‘మనిషనేవాడు నాగిన్‌ డాన్స్‌కు కాలుకదుపుతూ మద్దత్తిస్తాడు. తమ పెళ్లి బరాత్‌లలో నాగిన్‌ మ్యూజిక్‌ పెట్టుకుని, నోట్లో కర్చిఫ్‌ను బూరలాగా పట్టుకుని ఒకడు రోడ్డంతా దొర్లుతూ పొర్లుతూ నాట్యం చేస్తాడు. అంతేకాదు... సదరు నెమళ్ల నాట్యాన్నీ ఆమోదించే మనిషి తమ జాతిలో బాగా డాన్స్‌ చేసే డాన్సర్లకు ‘నాట్యమయూరీ’ / ‘నృత్యమయూరీ’ ఇత్యాది బిరుదులతో పాటు అనేక అవార్డులిచ్చి సత్కరిస్తుంటాడు. 

ఇంతాచేసి... ఎందుకోగానీ మరి... మా తొండజాతి బస్కీ నృత్యాన్ని చిన్నచూపు చూస్తాడు. అంతెందుకు... ఆఖరికి ప్రెషర్‌కుక్కర్‌పై తైతక్కలాడే వాల్వ్‌ చిందులనైనా డాన్స్‌గా పరిగణిస్తాడేమోగానీ... తొండ నృత్యాలను పరిగణనలోకి తీసుకోడు. తొండనుగానీ... లేదా తొండకు దగ్గరగా ఉన్న ఊసరవెల్లి తన అడుగులో అడుగేసుకుంటూ ముందుకు సాగుతూ చేసే ‘గిరిమృగ’ డాన్స్ను ఏమాత్రం పట్టించుకోడు మనిషి. ఇవి వివక్ష కాదా? దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం లేదంటారా?’’... ఇలా సాగుతున్నాయి తొండ ఆలోచనలు. 

ఇటీవలికాలంలో మనుషుల్లో ఆరోగ్యభావన ఎంతో పెరిగింది కదా. అందరూ ఏరోబిక్స్‌ను డాన్స్‌తో కలిపిప్రాక్టీస్‌ చేస్తున్నారు కదా. తమ ఫిట్‌నెస్‌ కోసం తమ వ్యాయామరీతిల్లో నాట్యాన్ని తగుపాళ్లలో మిక్స్‌ చేసి ‘జుంబాడాన్స్‌’ అంటూ పేరుపెట్టి ‘వర్కవుట్స్‌’ చేయసాగారు. అంతెందుకు... తమ మార్షల్‌ ఆర్ట్స్‌లో కుంగ్‌ఫూలో స్నేక్‌ మూవ్‌మెంట్లూ, మంకీల కదలికలూ, ఈగిల్‌ అంటూ గద్దల గడబిడలూ కలిపి కొట్టేసి ‘స్నేక్‌ ఇన్‌ ద ఈగిల్స్‌ షాడో’, ‘ద డ్రంకెన్‌ మంకీ’, ‘మ్యాడ్‌ మంకీ కుంగ్‌ఫూ’ అంటూ సినిమాలు తీసి ఆదరించారు. 

ఒకసారి తొండలమైన మేము ‘పుష్‌అప్స్‌’ తీస్తూ, జబ్బుల్ని దూరంగా పుష్‌ చేస్తున్నప్పుడు మా జాతిలోని ఛాందసుడొకాయన ‘‘పవిత్రమైన తొండడాన్స్‌లో పుష్‌అప్‌ కలిపేసి సశాస్త్రీయమైన మన నృత్యరీతుల్ని అపవిత్రం చేయకండి’’ అంటూ కోప్పడ్డాడు కూడా. మా తొండజాతిలో ‘‘నృత్యో రక్షతి ఫిట్‌నెసహాః’’ అనే ఓ స్లోగన్‌లాంటి సూక్తి కూడా ఉంది. అంటే... ‘నువ్వు బస్కీలతో నృత్యం చేస్తుంటే... అది నీ ఫిట్‌నెస్‌ను కాపాడుతుంద’ని దాని అర్థం. అలా... ఈ ప్రక్రియను ఎప్పుడో కనిపట్టేసిన మా డాన్స్‌ను ‘తొండజుంబా’ అనో, ‘జుంబతొండా’ అనో పేరు పెట్టి మనుషులు ప్రాక్టీస్‌ చేయరెందుకు? తమ పెళ్లిళ్లలో నాగిన్‌ డాన్స్‌ లాగా మా ‘తొండజుంబా’ను ఆదరించరెందుకు? ‘నాట్యమయూరి’లా ‘జుంబతొండీ’ అనే అవార్డును రెడీచేయరెందుకు?

ఇప్పుడు మా తొండల డిమాండ్‌ ఒక్కటే. తొండజుంబా ప్రక్రియకు మనుషులంతా ఏరోబిక్స్‌ తరహాలో మా ‘‘తొండోబిక్స్‌’’నూప్రాక్టీస్‌ చేయాలి. దీన్ని వాళ్లు తమ కార్డియో వర్కవుట్స్‌లో భాగం చేసి మా తొండజాతి నృత్యం పట్ల వివక్షను మానేయాలి. నాగిన్‌డాన్స్‌తో పాటు పెళ్లి బరాతుల్లో మా తొండనృత్యాన్నీ ప్రవేశపెట్టి దాన్నీ మన జనజీవననృత్యస్రవంతిలో భాగం చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది తొండవాళి. 
‘తొండవాళి...? వాట్‌ ఈజ్‌ దిస్‌ నాన్సెన్స్‌ వర్డ్‌? ఈ పదమేమిటి?’ అంటారా...! 
సమస్త మానవాళిలాంటిదే ఈ సమస్త తొండవాళి! తొండనృత్యం జిందాబాద్‌!!

– యాసీన్‌

 

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)