కుక్కలతో ఈ డేంజర్‌ కూడా ఉంది, ఈ వీడియో చూడండి!

Published on Wed, 08/07/2024 - 12:25

పెంపుడు జంతువు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కుక్క. విశ్వాసానికి మారు పేరు. యజమానికోసం, కుటుంబ రక్షణ కోసం తన ప్రాణాల్ని ఫణంగా పెడుతుంది. కానీ   ఇవి తెలిసీ తెలియక కొన్ని ప్రమాదాలను కొన్ని తెచ్చుకుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికాలోని అగ్నిమాపక విభాగం ఒక షాకింగ్‌ వీడియోను విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. 

అసలు విషయం ఏమిటంటే.. సాధారణగా  పెంపుడు కుక్కలు  ఇంట్లో ఏదో ఒక వస్తువును నములుతూ ఉంటాయి. రబ్బర్‌ వస్తువులు, చెప్పులను కొరికి, కొరికి అవతల పాడేస్తాయి. ఆఖరికి పరుపులు, దిండ్లను కూడా నాశనం చేస్తాయి. అలాగే వైర్లు, ఎలక్ట్రిక్‌ పరికరాలను నోట్లో పెట్టుకుని ప్రమాదాల్ని  కొని తెచ్చుకుంటూ ఉంటాయి.  అమెరికాలోని,  ఓక్లహోమా రాష్ట్రంలోని తుల్సా నగరంలో అలాంటిదే జరిగింది.  ఒక గదిలో రెండు కుక్కలు, పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో ఆడలాడుకుంటూ  గలాటా సృష్టించింది. ఒక్కసారిగా ఆ బాటరీ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలంటుకున్నాయి.  దీంతో భయపడిన మిగిలిన రెండూ అక్కడినుంచి తప్పించుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

 "లిథియం-అయాన్ బ్యాటరీల ప్రమాదాల" గురించి ప్రజలను హెచ్చరించడానికి తుల్సా అగ్నిమాపక విభాగం క్రింది వీడియోను  ఎక్స్‌లో షేర్‌ చేసింది. వీటిని పవర్‌అనియంత్రితంగా విడుదలైతే, వేడిని ఉత్పత్తి చేస్తుంది, మండే , విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తుంది ,పేలుళ్లకు కూడా దారితీస్తుందని హెచ్చరించింది. కాగా లిథియం అయాన్ బ్యాటరీ అనేది  రీచార్జ్ చేసుకొనే బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు.  సో.. బీ కేర్‌ఫుల్‌. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)