ఆరు రుచుల పండుగ

Published on Thu, 03/19/2026 - 00:56

ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్‌ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు

‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! 
ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై  కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ.  
తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’  సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!

మనసు రుచులు 
రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత  పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.

త్రిగుణాత్మక రుచులు
మనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా,  బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.

నోటి రుచులు
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. 
భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! 
అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! 

 

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)