Breaking News

ప్రపంచంలోనే బెస్ట్‌ డెజర్ట్‌గా భారతీయ స్వీట్‌!

Published on Sun, 03/17/2024 - 17:06

ప్రపంచంలోనే అత్యుత్తమ డెజర్ట్‌గా భారతీయ తీపి వంటకానికి చోటు దక్కింది. టాప్‌ 10 బెస్ట్‌ చీజ్‌ డెజర్ట్‌లో ఈ భారతీయ తీపి వంటకం ఒకటిగా నిలిచింది. ఇంతవరకు ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ బెస్ట్‌ కూర, బెస్ట్‌ కాఫీ, బెస్ట్‌ అల్పహార జాబితాను విడుదల చేసింది. తాజాగా భోజనం తర్వాత హాయిగా ఆస్వాదించే డెజర్ట్‌(స్వీట్‌) రెసిపీల జాబితాను విడుదల చేసింది. టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ 10 బెస్ట్‌ చీజ్‌ డెజర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'రసమలై' రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఈ 'రసమలై' స్వీట్‌ని ఇష్టపడని వారుండరు. దీన్ని పాలు, పంచదార, కుంకుమ పువ్వు, నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. హోళీ, దీపావళి వంటి పండగల సమయాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ చీజ్ డెజర్ట్‌లలో ఒకటిగా ఈ రసమలై గుర్తింపు పొందడం భారతదేశం గొప్ప పాక వారసత్వానికి ఈ తీపి వంటకంగా నిదర్శనంగా అని పలువురు పేర్కొన్నారు. ఇక ఈ జాబితాలో పోలాండ్‌కు చెందిన సెర్నిక్‌కి తొలి స్థానం దక్కించుకుంది. 

పోలాండ్‌కు చెందిన సెర్నిక్ అనేది గుడ్లు, చక్కెర ట్వరోగ్‌తో తయారు చేసే చీజ్‌ వంటకం. ఇది ఒక రకమైన పెరుగు చీజ్. ఈ చీజ్ సాధారణంగా చిన్న ముక్కలుగా ఉండే కేక్‌లా తయారు చేస్తారు. దీన్ని ఒక్కోసారి బేక్‌ చేస్తారు లేదా బేక్‌ చేయకుండానే కూడా చేయొచ్చు. ఇది చూడటానికి స్పాంజ్‌ కేక్‌లా జెల్లిలా ఉండి పైన ఫ్రూట్స్‌తో అలంకరించి ఉంటుంది. టేస్టీ అట్లాస్‌ విడుదల చేసిన ఈ చీజ్‌ డెజర్ట్‌ల జాబితాలో జపనీస్ చీజ్,బాస్క్ చీజ్ వంటి ఇతర ప్రసిద్ధ చీజ్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. టేస్టీ అట్టాస్‌ విడుదల చేసిన ఉత్తమ చీజ్‌ డెజర్ట్‌ పూర్తి జాబితా సవివరంగా ఇదే..

1. సెర్నిక్, పోలాండ్
2. రసమలై, భారతదేశం 3
3. స్ఫకియానోపిటా, గ్రీస్
4. న్యూయార్క్ తరహా చీజ్, USA
5. జపనీస్ చీజ్, జపాన్
6. బాస్క్ చీజ్, స్పెయిన్
7. రాకోజీ టురోస్, హంగరీ
8. మెలోపిటా, గ్రీస్
9. కసెకుచెన్, జర్మనీ
10. మిసా రెజీ, చెక్ రిపబ్లిక్

(చదవండి: బెస్ట్‌ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)