Breaking News

అంతరిక్ష వ్యర్థాలకు చెక్‌ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!

Published on Thu, 05/30/2024 - 17:24

సాధారణంగా ఉపగ్రహాలు లోహంతో తయారు చేస్తారు. అవి వాతావరణంలో పొరపాటున కాలిపోతే హానికరమైన చెత్తను సృష్టిస్తున్నాయి. ఈ శిథిలాల కార్యాచరణ ఇతర ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకకు గణనీయమైన ముప్పుని కలిగిస్తాయి. అందుకని ఈ సమస్యకు చెక్‌పెట్టేలా జపాన్‌ శాస్త్రవేత్తలు సరికొత్త ఉప్రగ్రహ్నాన్ని అభివృద్ధిచ చేశారు. దేనితో అంటే..

ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్‌ పరిశోధకులు లిగ్నోశాట్‌ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్‌ని క్యోటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్‌ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించగలిగారు. 

2020 ఏప్రిల్‌ నుంచి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే పనిలోపడ్డారు. ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకుమాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అందించగలవని పరిశోధకులు చెబుతున్నారు. చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ‍ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్‌ చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో ప్రయోగించనుంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్‌ ‍స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కి డెలివరీ చేయడం జరుగుతుంది. 

అక్కడ ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకునే సామార్థ్యం ఉందా లేదా వంటి పలు టెస్ట్‌లు చేస్తారు. అందుకోసం డేటాని పంపించి పరిశీలిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది గనుక విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్‌ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

(చదవండి: చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్‌..ఎంతకు అమ్ముడయ్యాయంటే..)

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)