Breaking News

జెన్‌ జీ క్వీన్‌

Published on Tue, 07/28/2026 - 06:09

పదమూడేళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది లియోనోర్‌. ‘బిడ్డా! భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది’ అని భవిష్యత్‌ బాధ్యతల గురించి ఆరోజు చెప్పాడు తండ్రి. ఆ రోజు రానే వచ్చింది. 150 ఏళ్ల తరువాత స్పెయిన్‌ దేశాన్ని పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్రపుటల్లో నిలవనుంది ఇరవై ఏళ్ల లియోనోర్‌....

స్పెయిన్‌ రాజు ఫిలిప్, రాణి లెటిజియాల పెద్ద కుమార్తె లియోనోర్‌ స్పెయిన్‌ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు పదమూడేళ్లు. ప్రసంగిస్తున్నంతసేపు లియోనోర్‌ ఎక్కడా భయపడినట్లు కనిపించలేదు. చాలా సహజంగా, ఆత్మవిశ్వాసంతో ప్రసంగించింది.

ప్రశంసల వెల్లువ
లియోనోర్‌ ప్రసంగం ముగిసిన తరువాత తండ్రి ఫిలిప్‌ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. 
‘లియోనోర్‌ మొట్ట మొదటి ప్రసంగం మహా అద్భుతం’ అని సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. పన్నెండేళ్ల వయసులోనే స్పెయిన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ గోల్డెన్‌ ఫ్లీస్‌’ను అందుకుంది లియోనోర్‌. ఏడాది తరువాత ప్రత్యేక ప్రసంగం చేసింది. రాణిగా బాధ్యతలు చేపట్టే దిశగా రాకుమార్తె సాగిస్తున్న ప్రయాణంలో ఇది ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలిచింది.

సవాళ్లు ఎదురుచూస్తున్నాయి!
ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాన్ని కూతురికి అందిస్తూ రాజు ఫిలిప్‌ ఇలా అన్నారు...
‘నువ్వు ఎదుర్కోవలసిన సమస్యలు, సవాళ్లు, భుజాలకెత్తుకోవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. నీకు కష్టంగా అనిపించవచ్చు. కాని స్పెయిన్‌లో నీ శ్రేయస్సును కోరుకునే ఎంతోమంది నీ వెనుక ఉన్నారనే విషయం మరచిపోవద్దు’

బహు భాషల్లో అనర్గళంగా...
150 ఏళ్ల తరువాత స్పెయిన్‌ను పరిపాలించబోయే మొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు లియోనోర్‌. త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాలు శిక్షణ పొందిన లియోనోర్‌ స్పెయిన్‌ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్‌లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు. మాడ్రిడ్‌లోని ఒక యూనివర్శిటీలో పొలిటికల్‌ సైన్స్‌ చదవనున్నారు.
మహిళా సాధికారతపై తీసిన సినిమాల నుంచి పర్యావరణ అంశాల వరకు లియోనోర్‌కు మంచి అవగాహన ఉంది.
‘సరైన సమయంలో సరైన అవకాశాలు కల్పించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికి ఉంది’ అంటారు లియోనోర్‌.
 
నా రోల్‌మోడల్స్‌ వారు కాదు...
నా రోల్‌మోడల్స్‌ ప్రసిద్ధ వ్యక్తులు కాదు. ఆకర్షణీయమైన వ్యక్తులు కూడా కాదు. తమలోని నైతిక విలువలు, కష్టపడే తత్వం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, తమ ప్రతిభాసామర్థ్యాలతో లోకానికి కొత్త విషయాలు తెలియజేసే వ్యక్తులు, సమస్యలకు భయపడకుండా ముందుకువెళ్లే ధైర్యవంతులు నా రోల్‌మోడల్స్‌.
– లియోనోర్‌
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)