Breaking News

అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే.. జైలే!

Published on Wed, 02/04/2026 - 19:27

వృత్తిరీత్యా నేను చిన్నపిల్లల వైద్యుణ్ణి. ఈ మధ్యన ఫిట్స్‌ వచ్చాయని ఓ నాలుగు నెలల పాపను తీసుకొని వచ్చారు. కారణాలు ఆరా తీస్తే పాపకు తాటి కల్లు తాగించార ని తెలిసింది. చిన్నపిల్లలకు తాటి కల్లు, ఈత కల్లు లేదా ఎటువంటి మద్యం తాగించినా అది వారికి చాలా ప్రమాదకరం. గతంలో కూడా ఎన్నో కేసులు చూశాను. ఇది నేరం అని కూడా తెలుసు. కానీ నా వద్దకు వచ్చిన పేషెంట్లకు ఎలా చెప్పాలో, చర్యలు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా మద్యం తాగిస్తే పిల్లలకు మంచిదనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. పైగా కల్లు అంటే అసలు మద్యం కాదు కదా అని నాతోనే వాదిస్తున్నారు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
– డాక్టర్‌ పసునూటి సుమంత్, వరంగల్‌

చిన్నపిల్లల చేత మద్యం తాగించడం ఎంత ప్రమాదమో నిపుణులైన మీరే చెప్పారు. అందుకే, చట్టం కూడా చిన్నారులకు మద్యం ఇవ్వటాన్ని కఠినంగా పరిగణిస్తుంది – శిక్షిస్తుంది. జువనైల్‌ జస్టిస్‌ చట్టం (బాలల పరిరక్షణ చట్టం) లోని సెక్షన్‌ 75 ప్రకారం చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేసినా, వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారి మానసిక ఆరోగ్యానికి లేదా శారీరక ఆరోగ్యానికి భంగం కలిగించే ఎటువంటి పనిచేసినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష – లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది.

అంతేకాకుండా సెక్షన్‌ 77 ప్రకారం: సముచిత అర్హత కలిగిన వైద్యుని ఆదేశం లేకుండా, ఏ వ్యక్తి అయినా పిల్లలకు మత్తు పానీయం/ మాదక ద్రవ్యం/ పొగాకు ఉత్పత్తులు లేదా సైకోట్రోపిక్‌ పదార్థాన్ని ఇచ్చినా, లేదా ఇప్పించినా, వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఎన్‌.డీ.పీ.ఎస్‌ వంటి చట్టాలలో నిషేధించబడిన మందులు ఇవ్వాలి అంటే కూడా కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది.

చ‌ద‌వండి: భార్య‌కు విడాకులు.. పిల్ల‌ల‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలా?

మత్తుపదార్థాలు ఇవ్వడమే కాదు వాటిని ప్రేరేపించడం కూడా నేరమే! కాబట్టి మీరు మీ వద్దకు వచ్చిన పేషెంట్లను గట్టిగా మందలించాలి. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఏదైనా అపాయం ఉంటుంది అనిపిస్తే – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారికి లేదా పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు. ఈమధ్య కొందరు చిన్నపిల్లలకు కల్లు పోయటం, పొగాకు ఇవ్వటం వంటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. వాళ్లందరూ కూడా శిక్షార్హులే! ప్రభుత్వ శాఖ వారు ఇటువంటి అంశాలను చాలా సీరియస్‌గా తీసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఆగుతాయి.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)