Breaking News

సైబర్‌ మోసంతో అకౌంట్‌ ఫ్రీజ్‌ అయితే...

Published on Wed, 05/20/2026 - 16:12

గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్‌ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్‌లైన్‌ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్‌ చేస్తున్నాము అని పంజాబ్‌ సైబర్‌ క్రైమ్‌ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. అలా ఫ్రీజ్‌ చేసేవరకు ఈ 500 నా అకౌంట్‌లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్‌ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్‌ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్‌ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. 
– చీమకుర్తి సునీల్‌ కుమార్, విజయవాడ

పంజాబ్‌ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్‌.ఐ.ఆర్‌. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్‌.ఐ.ఆర్‌.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. 

పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్‌ ఫ్రీజింగ్‌ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్‌ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్‌ పిటిషన్‌ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్‌ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్‌.ఐ.ఆర్‌.ను– పంజాబ్‌ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. 

మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్‌ /లీన్‌ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్‌ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే  బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. 

- శ్రీకాంత్‌ చింతల హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

చదవండి: 'థాంక్యూ డియర్‌ పేరెంట్స్‌': ఒక తరం త్యాగ ఫలితమే..

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సెంటర్‌లో సందడి (ఫొటోలు)