Breaking News

పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్‌ ఇప్పించండి..!

Published on Wed, 03/26/2025 - 10:07

మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్‌ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు.  తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్‌ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.
– విజయ, హైదరాబాద్‌

మీ మేనకోడలు ఒక మేజర్‌. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్‌ లేనట్టు కనిపిస్తుంది. 

బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్‌ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి. 

కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్‌ ఇప్పించండి.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.)

(చదవండి: యాక్సియల్‌ స్పాండిలో ఆర్థరైటిస్‌ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్‌ భట్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)