Breaking News

అలాంటివి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..!

Published on Wed, 04/16/2025 - 09:33

నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. పెరిమెనోపాజ్‌ స్టేజ్‌లో ఉన్నాను. దాంతో ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ వస్తున్నాయి. ఆ  సమయంలో చికాకుగా, ఆందోళనగా... ఎవరైనా ఏమైనా అంటే కొట్టాలన్నంత కోపంగా ఉంటుంది. మొదటి రెండు రోజులూ ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. దాంతో నావల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను డేట్‌ రాగానే లీవ్‌ పెడుతుంటాను. అయితే ఈ విషయమై కొందరు నా గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. కొందరైతే ఆ డేట్స్‌ గుర్తు పెట్టుకుని మొహం మీదే నువ్వు ఇంకా సెలవు పెట్టలేదేంటి అని వెకిలిగా అడుగుతుంటారు. నాకు చాలా బాధగా ఉంది. దీని గురించి నేను ఏమీ చేయలేనా? సలహా ఇవ్వగలరు. 
– ఒక సోదరి, హైదరాబాద్‌ 

2013 పీఓఎస్‌హెచ్‌ చట్టం ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి లేదా అనేక అవాంఛనీయ(అంగీకార యోగ్యం కాని) చర్యలు లేదా ప్రవర్తన/వైఖరి ‘‘లైంగిక వేధింపు’’గా పరిగణించబడుతుంది:
1. శారీరక సంప్రదింపు (కొరకు) పురోగతి, 
2. లైంగిక ప్రయోజనాలు కోరటం/అభ్యర్థించడం లేదా డిమాండ్‌ చేయటం, లేదా
3. లైంగిక స్వభావం కలిగిన వ్యాఖ్యలు చేయటం, లేదా
4. అశ్లీల చిత్రాలను చూపించటం లేదా
5. మరే ఇతర లైంగిక స్వభావం కలిగిన అవాంఛనీయ (ఆమోదయోగ్యం కాని) శారీరక, మౌఖిక లేదా సైగల ద్వారా ప్రదర్శించటం.

ఒక స్త్రీ తన మెనోపాజ్‌ దశలో ఎదుర్కొనే అనేక శారీరక – మానసిక మార్పులు, మూడ్‌ స్వింగ్స్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ కారణంగా స్త్రీ పట్ల వివక్ష లేదా శిక్షపూరిత చర్యలు తీసుకోవటం, అనుచితంగా (ఇన్‌సెన్సిబుల్‌) వ్యవహరించడాన్ని కూడా లైంగిక వేధింపుగానే పరిగణించాలి. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 స్ఫూర్తి కూడా ఇదే! మీరు ఏం భయపడకుండా దీనిమీద మీ బాస్‌కి చెప్పి చూడండి. ఒకవేళ మీ పై అధికారులే మిమ్మల్ని కామెంట్‌ చేస్తూ బాధపెడుతుంటే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMకు మెయిల్‌ చేయవచ్చు. )

(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!)

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)