Breaking News

ఆ పరీక్షే నాకు ఆనందాన్నిస్తోంది..!

Published on Thu, 03/06/2025 - 10:32

ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...

నా పూర్వజన్మ సుకృతం
ప్రతిసారీ ప్రవచనం చెప్పడం నాకొక గొప్ప పరీక్ష. ఆ పరీక్షే నాకు చాలా అనందాన్నిచ్చేది. విస్తృతంగా గ్రంథ పఠనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆవళింపు చేసుకున్న విషయాన్ని సభాముఖంగా సుస్పష్టంగా వివరిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించడం ప్రవచనకారిణిగా నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. ఎంతోమంది ప్రఖ్యాత ప్రవచనకారుల ఉపన్యాస వైదుద్యాన్ని తెలుసుకోవడం కోసం వీలున్నప్పుడల్లా వారి ఉపన్యాసాలు వినేదాన్ని. 

ఇంకొక విషయం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించిన ప్రవచన వేదికలన్నీ చాలా శక్తివంతమైనవి.  ఎన్నో దేవాలయ ప్రాంగణాలు, ఎన్నో ధార్మిక సంస్థల వారి వేదికలు, మరెన్నో ప్రాచుర్యం వహించిన ఆధ్యాత్మిక స్థలాలు నాకు చేయూతనిచ్చాయి.  కాలం మారింది. నేడు ఎందరో యువతీయువకులు ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. 

నా ప్రవచనం పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి ‘‘అమ్మా! మీరు చెబుతున్న విషయాలు బాగున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి ? ఏ ఏ గ్రంథాలయాలలో  పుస్తకాలు కోసం వెదకాలి. అని అడుగుతుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నాకు సాధ్యమైనంతవరకు వారికి తగిన మార్గాన్ని సూచిస్తుంటాను. 
– డాక్టర్‌ దుర్భాకుల హేమ 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)