Breaking News

గోంగూర మజాకా : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

Published on Tue, 07/30/2024 - 15:33

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోంగూర, దాని రుచిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆంధ్రామాత, పుంటికూర ఇలా ఏ పేరుతో పిలిచినా గోంగూర వంటకాలను మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంతటి మహత్తరమైన రుచి ఉంది ఈ ఆకూకురలో. రుచికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఇది రారాజు లాంటిదనే చెప్పవచ్చు.

నోరూరించే వంటకాలు 
గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, పులుసు ఇలా రకరకాలుగా దీన్ని ఆస్వాదించవచ్చు. గోంగూర నిల్వ పచ్చడిని కూడా ఉసిరి,  పండు మిరపకాయ, అ‍ల్లం  ఇలా అనేక కాంబినేషన్స్‌తో తయారు చేసుకోవచ్చు. ఇక నాన్‌ వెజ్‌ వంటకాల్లో  గోంగూర చికెన్‌, గోంగూర మటన్‌, గోంగూర రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు అబ్బో.. ఈ లిస్ట్‌ పెద్దే.  అసలు ఇన్ని రకాలుగా మనం ఆస్వాదించగలిగిదే ఒక్క గోంగూరతోనే నేమో!

గోంగూరతో  ప్రయోజనాలు 
గోంగూరలో విటమిన్ సీ, ఏ, బీ1, బీ2, బీ 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌ పుష్కలంగా లభిస్తాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు బలంగా మారతాయి.  మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జ్వరాలు ,వాపులకు చికిత్స చేస్తుంది.

అంతేనా  గోంగూరతో జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.  జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండలం వల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. రేచీకటికితో ఇబ్బందిపడే వారు తరచూ గోంగూర  తింటే మంచి ఫలితం ఉంటుంది.

గోంగూర పూలు, కాయలతో కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా. గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచిది. గోంగూరలో అధికంగా లభించే విటమిన్‌ ఏ,  సీ కంటెంట్,  ఇందులో  ఉండే క్లోరోఫిల్స్ కేన్సర్ చికిత్సలో సహాయపడతాయి. మూత్రపిండాలు, మూత్ర నాళాల వ్యాధుల నివారణలో ఉపయోగ పడుతుంది. ఇంకా బరువు నియంత్రణలోనూ, మధుమేహాన్ని నియంత్రిచడంలోనూ సాయపడుతుంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)