ఆ విచారణకు మీ హాజరు తప్పనిసరేం కాదు!

Published on Wed, 03/11/2026 - 16:16

నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చాను. వారు సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఫస్ట్‌ అప్పీల్‌ దాఖలు చేశాను. ఇప్పుడు వారు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా ఒక లేఖ పంపి, 7 రోజులలోపల విచారణకు హాజరు కావాలని చెప్పారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ విచారణకు హాజరు కావాలా? లేదా ఏమీ చేయకుండా సెకండ్‌ అప్పీల్‌ సమయం వచ్చిన తర్వాత నేరుగా రెండవ అప్పీల్‌ వేయాలా లేక కమిషన్‌కుపోవాలా? 
– నరేష్, నందిగామ

ఆర్టీఐ చట్టం ప్రకారం, కోరిన సమాచారం సాధారణంగా రాతపూర్వకంగా లేదా మీరు కోరిన రూపంలో ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, మొదటి అప్పీల్‌కు ప్రజా సమాచార అధికారి ఇచ్చిన సమాధానం వుంటే ఆ సమాధానం ఆధారంగా లేదా అప్పీల్‌లో పేర్కొన్న కారణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అప్పీల్‌ అధికారి తన విచక్షణ ప్రకారం అప్పీల్‌దారుని విచారణకు పిలవవచ్చు కానీ మీరు హాజరు కావడం తప్పనిసరేమీ కాదు. రాతపూర్వక రికార్డుల ఆధారంగానే అప్పీల్‌ను నిర్ణయించవచ్చు. చాలా అప్పీలు దరఖాస్తులు అప్పీలు దారుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే నిర్ణయించబడుతాయి.

మీరు హాజరు కావాలనుకోకపోతే, రాతపూర్వకంగా కేసును పరిశీలించి రికార్డు ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థించవచ్చు. విచారణకు పిలవడం ద్వారా ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వక (లేదా మరే ఇతర విధానంలో కోరితే అలాగ) సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతను కాదనలేరు. అందువల్ల, మీ ఆర్టీఐ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మీరు కోరడం పూర్తిగా చట్టబద్ధమైనది.

మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, అప్పీల్‌ను రాతపూర్వక రికార్డుల ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారని లేఖ రాయండి. పోస్టల్‌ స్లిప్పులు భద్రపరచుకోండి. మీకు సమాచారం లేదా పరిష్కారం దొరక్కపోతే, 90 రోజుల్లోగా కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు విచారణ నోటీసును పూర్తిగా పట్టించుకోలేదని ఎవరూ చెప్పలేరు. సంబంధిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందితే సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందితే స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ – వద్ద అప్పీల్‌ చేయాలి.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. ) 

(చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

#

Tags : 1

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)