Breaking News

డీఆర్‌టీలో వేలానికి వచ్చిన ఇల్లు కొనచ్చా?

Published on Wed, 08/13/2025 - 10:08

ఇటీవలే ఒక జాతీయ బ్యాంకు వారు జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఇల్లు వేలంపాట ద్వారా అమ్మకానికి పెడుతున్నట్లు చూశాను. అందులో ఏవేవో కేసు నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్లి చూడగా మాకు బాగా నచ్చింది. ఆ ఇంటి పూర్వ యజమాని లోను కట్టలేకపోవటం వలన బ్యాంకు వారు డీఆర్‌టీలో కేసు వేయడం ద్వారా ఇల్లు వేలానికి వచ్చిందని తెలిసింది. ఇలాంటి ఇంటిని వేలంపాటలో కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 
– కిషోర్‌ కుమార్, వరంగల్‌ 

మీరు చూసిన ప్రకటన డీఆర్‌.టీ (డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌) కేసుకు సంబంధించి అయి ఉండవచ్చు. ఎవరైనా ఇంటి లోను/ఆస్తిపై లోను తీసుకొని తిరిగి కట్టలేని పక్షంలో దశలవారీగా బ్యాంకు వారు తగిన నోటీసులు జారీ చేసి, అప్పటికి కూడా బకాయిలు చెల్లించకపోతే ఆస్తి/ఇంటి పొజిషన్‌ తీసుకోవడానికి చర్యలు చేపడతారు. 

అక్కడ చట్టం ప్రకారం పొజిషన్‌ తీసుకోవడానికి సైతం బ్యాంకు వారికి ఎటువంటి కోర్టు ఆర్డర్‌ అవసరం లేదు. పొజిషన్‌ పొందిన బ్యాంకు వారు వేలంపాట వరకు వస్తే, అలాంటి ఆస్తిని/ఇంటిని వేలంపాటలో పాల్గొని, కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను, కోర్టు ఉత్తర్వులను, బ్యాంకు వారి పొజిషన్‌ విధానం మొదలైన వాటిని క్షుణ్ణంగా చూసుకొని కొనుక్కున్నవారికి సాధారణంగా ఎటువంటి ఆటంకాలు రాకపోవచ్చు. వేలంపాట సమయంలోనే మీరు బ్యాంకు సూచించినంత (సుమారు 25%) డిపాజిట్‌ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. 

మిగతా డబ్బులు చెల్లించడానికి మీకు గరిష్టంగా మూడు నెలల సమయం వరకు ఇవ్వవచ్చు. అయితే ఇలాంటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన కొన్ని అంశాలు...
1)    ఇంకా ఏమైనా కోర్టు కేసులు – ముఖ్యంగా డీ.ఆర్‌.టీ. లో ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా 
2)    బ్యాంకు వారికి పూర్తి పొజిషన్‌ ఉందా లేక సింబాలిక్‌ పొజిషన్‌ ఉందా 
3)    కొనుగోలు దారునికి పొజిషన్‌ ఎన్నాళ్ళకు ఇవ్వవచ్చు?
4)    ఎన్కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ ద్వారా సదరు ఆస్తిపై ఇంకెవరికైనా హక్కులు ఉన్నాయా లేదా 
5)    ఏదైనా సంస్థకు ఆస్తి పన్ను, బిల్లులు వంటివి ఏమైనా బకాయిలు ఉన్నాయా 
6)    ఆస్తి/ఇంటి పై అనుమతులు లేని కట్టడాలు / మార్పులు ఏమైనా చేశారా? (చేస్తే బ్యాంకు వారి తగిన మార్పులు, సవరణలు చేసి ఇవ్వాలి) 

పైన సూచించిన అంశాలు మాత్రమే కాకుండా ఇంటి పత్రాలను, కోర్టుపత్రాలను, బ్యాంకు లావాదేవీ పత్రాలను, పత్రికా ప్రకటనలను కూడా మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన ఒక లాయర్‌ గారి దగ్గరికి తీసుకువెళ్లి అభిప్రాయం తీసుకుంటే మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు వారిని అదనపు పత్రాలు ఇవ్వవలసిందిగా కోరవచ్చు.
శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాద మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం 
sakshifamily3@gmail.comMýSకు మెయిల్‌ చేయవచ్చు.  

(చదవండి: ఎవరీ'లేడీ టార్జాన్‌'? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో విందుకు ఆహ్వానం..)


 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)