Breaking News

మెగా మామ్!

Published on Sun, 06/07/2026 - 00:30

‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి. ఇప్పుడు కెరీర్, ఫ్యామిలీ, మదర్‌హుడ్‌ను అందంగా బ్యాలెన్స్ చేస్తూ కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నా; వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్‌గా, ప్రశాంతంగా ఉంచుకునే ఈ చిల్‌ గర్ల్‌ మనసులోని ముచ్చట్లు ఆమె మాటల్లోనే!

మిస్‌ ఉత్తరాఖండ్‌
పుట్టింది అయోధ్యలో, పెరిగింది డెహ్రాడూన్ లో. నాకు చిన్నప్పటి నుంచే షోబిజ్‌పై ఆసక్తి ఉండేది. కానీ ముందు చదువు పూర్తి చేయాలన్న నాన్న కండిషన్‌తో భరతనాట్యం నేర్చుకుంటూ, ముంబైలో ఎకనామిక్స్‌ చదువుతూనే మోడలింగ్‌ మొదలుపెట్టాను. 2006లో ‘మిస్‌ ఉత్తరాఖండ్‌’ గెలవడం నా కలలకు మొదటి అడుగు అయ్యింది.

‘మిథున’ నుంచి బయటకు రాలేకపోయా
‘అందాల రాక్షసి’ చిన్న సినిమాలో నేను నటించలేదు, ‘మిథున’గా జీవించాను. షూటింగ్‌ అయిపోయాక కూడా అదే తరహా దుస్తులు, బొట్టు పెట్టుకుని తిరిగేదాన్ని. చివరకు నన్ను నేను బలవంతంగా ఆ పాత్రలోంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

నా జోక్స్‌కి నేనే నవ్వేస్తా!
నేను చాలా జోవియల్‌ పర్సన్ ని. నా సెన్స్ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా బాగుంటుంది! కొన్నిసార్లు జోక్‌ పూర్తిగా చెప్పకముందే నేనే నవ్వేసుకుంటాను. పక్క వాళ్లకు అర్థం కాకపోయినా నాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది.

అమ్మ పెట్టిన 7 పీఎం రూల్‌! 
మా అమ్మ ఎప్పుడూ ‘సాయంత్రం 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి’ అనే ఒక స్ట్రిక్ట్‌ రూల్‌ పెట్టేది. అది నా మనసులో ఎంతలా నాటుకుపోయిందంటే, ఈ రోజుల్లో కూడా నేను ఎప్పుడైనా సాయంత్రం పూట బయట ఉంటే, 7 గంటలు దాటగానే నాలో తెలియకుండానే ఒక ఆందోళన  మొదలైపోతుంది.  

మంచం కింద దాక్కుని నెయ్యి తినేదాన్ని!
చిన్నప్పుడు అమ్మ నెయ్యి కాస్తే, ఆ గిన్నె మొత్తం సీక్రెట్‌గా ఎత్తుకెళ్లి, మంచం కింద దాక్కుని మొత్తం తినేసేదాన్ని! ఇప్పటికీ నేను ఫుడ్‌ లవర్‌నే. ముఖ్యంగా బంగినపల్లి మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం.

కోపం అంటే ఓడిపోయినట్టే!
నాకు కోపం రావడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనల్ని మనం కంట్రోల్‌ చేసుకోలేకపోవడం అంటే ఓడిపోయినట్టే అనిపిస్తుంది. చాలా 
ఇరిటేట్‌ అయినప్పుడు.. గొడవపడను, అరిచేయను.. పూర్తిగా సైలెంట్‌ అయిపోతాను.

బొట్టు అంటే ప్రత్యేకమైన ప్రేమ!
ఒక చిన్న బొట్టు మొత్తం లుక్‌ని మార్చేస్తుంది. అది మన ఎక్స్‌ప్రెషన్ ్సని ఇంకా అందంగా చూపిస్తుంది. అందుకే నాకు ట్రెడిషనల్‌ స్టయిల్‌ అంటే చాలా ఇష్టం.

డాన్స్‌ నాకు థెరపీ!
డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్‌ చేస్తుంటే మైండ్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.

డాన్స్‌ నాకు థెరపీ!
డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్‌ చేస్తుంటే మైండ్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.

సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌లు తీసుకుంటా!
కొన్నిసార్లు సోషల్‌ మీడియాలో చాలా సమయం గడిపితే మనశ్శాంతి తగ్గిపోతుంది. అందుకే మధ్య మధ్యలో ఫోన్‌ పక్కన పెట్టేసి, కొన్ని రోజులు పూర్తిగా సోషల్‌ మీడియాకు దూరంగా.. ఫ్యామిలీ, పెట్స్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయడానికే ఇష్టపడతాను.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)