ఆ 16 అమ్మాయి డ్యాన్స్‌కు.. నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..

Published on Tue, 06/17/2025 - 13:28

రాత్రికి రాత్రికే స్టార్‌ డమ్‌ తెచ్చుకుంది ఓ యువతి. ఎలాంటి శిక్షణ లేకుండానే లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేసి అందర్నీ ఆశ్యర్యపరిచింది. సెలబ్రిటీల మన్ననలను అందుకుని ఒక్కసారిగా సోష్‌ల్‌ మీడియా స్టార్‌డమ్‌ హోదాను అందుకుంది. ఎవరామె అంటే..

చత్తీగఢ్‌లోని జగదల్‌పూర్‌కి లావణ్యదాస్‌ (Lavanya Das) స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కుమార్తె. ఈ 16 ఏళ్ల అమ్మాయి ఆశా భోంస్లే ఆజాకు పియా తు అబ్ పాట లయబద్ధంగా బెల్లీడ్యాన్స్‌ చేసింది. ఆ వీడియోని జూన్‌ 4న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. అంతే ఒక్కసారిగా ఆ వీడియో ఆమెకు ఎంతమంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టిందంటే.. సాక్షాత్రు బాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. ఆమె నృత్య ప్రతిభకు ముగ్దురాలైంది. 

ఆ జబల్‌పూర్‌ పట్టణంలోని సక్సెస్ కాన్వెంట్ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతున్న లావణ్య తన వీడియో ప్రియాంక చోప్రాను ఆకర్షిస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో సరదాగా పోస్ట్‌ చేసిన వీడియో ఇంత మంచి ఫేమ్‌ తెచ్చిపెట్టినందుకు ఆనదంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది. నిజానికి లావణ్య నటుల కుటుంబ నుంచి వచ్చిన నేపథ్యమే ఆమెది. బహుశా అదే ఆమెకు వారసత్వంగా వచ్చి.. ఇలా నృత్యకారిణిగా పేరుతెచ్చుకునేందుకు కారణమై ఉండొచ్చు. 

ఆమె తల్లి నీలిమా దాస్‌ మాణిక్‌పూరి, హల్బీ మాండలికంపై మంచి పట్టు ఉన్న తాతయ్య భాగీరథి దాస్ మహానంది ఇద్దరూ ధియేటర్‌ నటులు. ఇక లావణ్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. ఆమె ఇప్పటికే ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ సంగీత వీడియోలలో నటించింది. అలాగే దూరదర్శన్‌ కార్యక్రమాల్లో బాల కళాకారణి కూడా. 

నిజానికి ఆమె నృత్యం లేదా నటనలో ఎటువంటి శిక్షణ పొందలేదు. ఆమె స్వయం శిక్షిత నృత్యకారిణి. అయితే ఆమె తల్లి నీలిమ శిక్షణ పొందిన కథక్‌ నృత్యకారిణి, పైగా ట్యూటర్‌గా పనిచేస్తున్నారామె. ప్రస్తుతం లావణ్య తన పన్నెండో తరగతి పరీక్షలు పూర్తి అయ్యిన వెంటనే ఢిల్లీ లేదా హైదరాబాద్‌ నగరంలో యాక్టింగ్‌ కోర్సులో చేరాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ఆమె తండ్రి 2019లో మరణానంతరం ఈ తల్లి కూతుళ్లిద్దరూ తమ కుటుంబ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు.  

చదవండి: ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్‌ ఇవే..!
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)