Breaking News

నెస్ట్‌..ఆర్కిటెక్చర్‌లో బెస్ట్‌..!

Published on Sun, 03/02/2025 - 10:52

గూడు.. మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకూ ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి. ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే.. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. 

అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్లు, అడవులకే పరిమితమైన వీటి గూళ్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌సీయూలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువతకు పక్షులను జూ లోనో, పార్కుల్లో సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ల సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు. 

అలాంటి పక్షుల గూళ్లు పదుల సంఖ్యలో హెచ్‌సీయూ కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పక్షి గూళ్లకు నిలయంగా మారింది. 

ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో దాదాపు 233 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్లను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్‌లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. 

(చదవండి: సైకిల్‌ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!)
 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)