జగాలన్నీ ఒకెత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు

Published on Wed, 08/13/2025 - 12:46

పాండవుల బలం గురించి మాటిమాటికీ అడుగుతూ ఉండే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన కృష్ణతత్వం అనంతం. ‘జగాలన్నీ ఒక ఎత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు. అతని ముందు ఎన్నున్నా ఏవున్నా దుర్బలాలు. అతని సంకల్పాన్ని బట్టి సృష్టి, పుష్టి, నష్టి కలుగుతూ ఉంటాయి. సత్యమూ, ధర్మమూ స్థిరంగా ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. అక్కడే జయమూ ఉంటుంది. అన్ని లోకాలూ తానే అయి అన్ని జీవులలో ఆత్మగా ఉంటూ విహరిస్తూ ఉంటాడు. మాయను స్వీకరించి ఈ లోకంలో ఏదో రూపాన పుట్టి దుష్టశిక్ష, శిష్ట రక్ష చేస్తూ ఉంటాడు. పాండవుల కష్టాలు పోగొట్టాలనే నెపంతో ధర్మబాహ్యులైన నీ కొడుకులను నిగ్రహించడానికే ఆయన వచ్చా’డంటాడు సంజయుడు. 

‘ఆ దేవుని తత్వం ఏ మాత్రం తెలిసిన వారైనా సరే ఆయన్ని ఆశ్రయిస్తారు. హాయిగా బతుకుతారు. విద్య, అవిద్య అని రెండున్నాయి. అవిద్యకు లొంగినవాడు తామసుడై విష్ణువును తెలుసుకోలేడు. విద్వావంతుడే తెలుసుకోగలడు. విద్య అంటే ఎలాంటిదంటే, సత్వ రజ స్తమో గుణాల వికారాలకు లొంగక ధర్మాన్ని అనుష్ఠిస్తూ భావశుద్ధి కలిగి ఉండటమే. విష్ణువును తెలుసుకోవడానికి ఎవరికైనా ఇదే దారి. విద్యా లక్షణాలకి విరుద్ధమైన పద్ధతి అవిద్య’ అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడిని ‘ధర్మపరుడవై కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే నువ్వూ నీ తమ్ములూ సుఖంగా బతకొచ్చు’ అంటాడు. కానీ దుర్యోధనుడికి ఆ మాటలు రుచించవు. గాంధారితోనూ చెప్పిస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ వింటేగా దుర్యోధనుడు! అన్నిటిలో తాను ఉంటూ అన్నిటినీ తనయందు ఉంచుకుంటాడు... ఇదే ‘వాసుదేవ’ నామానికి  అర్థం. దీనిని సరిగ్గా తెలుసుకున్నవారు శుభ ఫలితం పొందుతారు. 
–  యామిజాల జగదీశ్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)