Breaking News

వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!

Published on Thu, 07/23/2026 - 17:48

వర్షాకాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం అత్యంత కష్టం. ఎందుకంటే పురుగులు పట్టడం లేదా తొందరగా పాడైపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా బియ్యం వంటి పెద్ద మొత్తంలో ఉండే వాటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి.

బియ్యంలో గడ్డలు లేదా పురుగులు కనిపించినంత మాత్రాన ఆ బియ్యాన్ని పారవేయకూడదు. బియ్యాన్ని పూర్తిగా ఎండబెట్టి, జల్లించి లేదా శుభ్రం చేసిన తర్వాత సురక్షితంగా ఉపయోగించవచ్చు. సాధారణంగా బియ్యపు పురుగు బియ్యపు గింజలో నేరుగా ఒక చిన్న రంధ్రం చేస్తుంది. అది ఆ తర్వాత ఆ రంధ్రంలో ఒక గుడ్డు పెట్టి, ఒక ప్రత్యేక పదార్థంతో దాన్ని మూసివేస్తుంది.

కొన్ని రోజుల తర్వాత, గుడ్డు నుంచి లార్వా బయటకు వస్తుంది. ఆ తర్వాత అది గింజ లోపల నివశిస్తూ..దాన్ని తింటూ పెరుగుతుంది. దాంతో అది బియ్యపు గింజలా బయటకు కనిపించినా..లోపల బోలుగా ఉంటుంది. చివరకు ఆ బియ్యం గింజ నుంచి బయటకు వచ్చే సమయాలనికి బియ్యం మొత్తం పొడిపొడిగా, పిండిగా కనిపిస్తాయి. ఇలా జరగకూడదంటే ఈ టిప్స్‌ ఫాలో అయితే సరి. మరి అవేంటో చూసేద్దామా.!.

ఎలా చెక్‌పెట్టాలంటే..
బియ్యంలో పురుగులు (వీవిల్స్) ఉన్నట్లు గమనిస్తే, ముందుగా దానిని ఒక పెద్ద పళ్ళెంలో పరచి, 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉంచండి. ప్రకాశవంతమైన వెలుతురు, వేడి వల్ల చాలా వరకు పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత పురుగులను జల్లెడ ద్వారా లేదా చెరగడం ద్వారం వేరు చేయాలి. ఆ తర్వాత స్పష్టంగా రంధ్రాలు లేదా గుంటలు ఉన్న బియ్యపు గింజలను ఏరివేయండి!. 

వండడానికి ముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి. పురుగులు మళ్లీ రాకుండా ఉండటానికి, శుభ్రం చేసిన బియ్యాన్ని 48 గంటల పాటు ఫ్రీజర్‌లో

బిర్యానీ ఆకులు (తేజపత్ర), వేప ఆకులు, ఎండు మిరపకాయలు, పసుపును వంటి వాటితో దీనికి చెక్‌ పెట్టొచ్చు.

అలాగే బియ్యాన్ని ఎప్పుడూ..గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. 

ఒకవేళ అప్పటికే పురుగులు పట్టి ఉంటే..బియ్యాన్ని గోరువెచ్చని నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేయండి. దీనివల్ల పురుగులు చనిపోతాయి.

బిర్యానీ ఆకులు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన,  ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.

వర్షాకాలంలో బియ్యం నిల్వ చేసే తొట్టెల్లో వీటిని 3 నుండి 5 శాతం వేస్తే సరిపోతుంది. ఇవి కీటకాలకు నచ్చని బలమైన సువాసనను వెదజల్లుతాయి, కాబట్టి మీ ధాన్యం ఎటువంటి రసాయన అవశేషాలు లేకుండా తాజాగా మరియు పురుగుల బారి నుండి రక్షించబడుతుంది.

లవంగాల ఆకులు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన మరియు ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.

(చదవండి: తామర పువ్వులు తినడం వల్ల నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా? నిపుణులు ఏమంటున్నారు)

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)