Breaking News

గుండు...  చాలా బాగుండు!

Published on Fri, 07/31/2026 - 06:32

శంబాల రాజ్య పాలకుడు చంద్రభూపతిని ఒక వార్త ఆకర్షించింది... ‘గుండు కొట్టించుకుంటే డబ్బులు వస్తాయని మహిళలను మోసం చేసిన వ్యక్తి. నిజమేనని నమ్మి మోసపోయిన కొందరు మహిళలు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది’ ఈ వార్త చదవగానే మహారాజు ఆలోచనలో పడ్డాడు.

‘అసలు తల వెంట్రుకల వల్ల ప్రయోజనం ఏమిటి? తలవెంట్రుకలు ఉన్నాయి కాబట్టి స్నానం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు వాడతాము. దీని వల్ల నీటి వృథా. తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి షాంపులు వాడతాము, హెయిర్‌ డై వేస్తాం. దీనివల్ల ఇంటిఖర్చు పెరుగుతుంది. తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి నూనె లేదా మరో ఆయిలో వాడాల్సి వస్తుంది. అదో ఖర్చు. తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి నెలకు ఒకసారైనా సెలూనుకు పోవాల్సి వస్తుంది. గొడవల్లో ఒకరి జుట్టు ఒకరు పీక్కోవడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుంది...’ ఇలా ఆలోచించిన మహారాజు తల వెంట్రుకల వల్ల సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో తన ల్యాప్‌టాప్‌లో లెక్క వేశాడు.

‘సంవత్సరానికి ఇంత ఖర్చా? వేస్ట్‌...వేస్టున్నర వేస్ట్‌. ఈ డబ్బును ఆదా చేస్తే ఎన్నో పనులు చేయవచ్చు’ అనుకున్నాడు. అప్పుడు అతడి మదిలో ఒక ఐడియా ఢమాల్‌ అని మెరిసింది.
  
శంబాల రాజ్యంలో ‘గుండోదయం’ అనే కొత్త పథకం ప్రకటించారు. ‘మీరు గుండు చేసుకుంటే చాలు...మీ ఎకౌంట్‌లో డబ్బులు వేస్తాము’ అని ప్రకటించారు మహారాజు. ‘ఏడ్చినట్లే ఉంది’ అని తిట్టుకున్నారు ప్రజలు. బహిరంగంగా తిట్టిన వారిని తీసుకెళ్లి జైలులో వేశారు. ‘మన గుండోదయం పథకానికి అనుకున్నంత రెస్పాన్స్‌ రావడం లేదు. గుండమ్మ కథ సినిమాని రీరిలీజ్‌ చేసి జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లండి’ ఆదేశించారు మహారాజు.

‘అయ్యా, గుండు చేసుకోవడానికి, గుండమ్మ కథకు ఎలాంటి సంబంధం లేదు’ అన్నాడు వ్యక్తిగత సహాయకుడు.
‘ఓహో అలాగా! నేను ఆ సినిమా చూడలేదు. ఇంటర్నేషనల్‌ గుండు స్పెషలిస్ట్‌లను మన రాజ్యానికి పిలిపించి గుండు ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి. ఎక్కువసార్లు గుండు చేసుకున్న వ్యక్తులకు గుండు శ్రీ పేరుతో పురస్కారాలు ఇవ్వండి’ అని ఆదేశించాడు మహారాజు.
‘టైటిల్‌లో గుండు అనే పదం ఉంటే చాలు అలాంటి సినిమాలకు ఊహించనంత రాయితీ, సబ్సిడీ ఇస్తాం’ అని ప్రకటించారు మహారాజు. దీంతో...‘గుండు బాహుబలి’ ‘పుష్ప గుండు’ ‘గుండు ముత్యం’ ‘ఘరాన గుండు’ ‘జేమ్స్‌బాండ్‌–గుండు బాండ్‌’... ఇలాంటి పేర్లతో ఎన్నో సినిమాలు వచ్చాయి
  
‘మన గుండోదయం పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?’ గూఢచర్య విభాగం అధిపతిని అడిగారు మహారాజు.
‘అయ్యా... ఉన్నదున్నట్లు చెప్పమంటారా? అబద్ధాలు చెప్పమంటారా?’ అడిగాడు గూఢచర్య అధిపతి. ‘ఈసారి మాత్రం నిజమే చెప్పు’ అన్నాడు మహారాజు.
‘నమ్మిన వారికి గుండు కొట్టించడంలో మీకు మీరే సాటి, ఘనాపాఠీ అంటున్నారు. మీకు గుండు కొట్టించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు’ అని నిజం నిర్భయంగా చెప్పాడు గూఢచర్య శాఖ అధిపతి.

– యాకుబ్‌ పాషా


 

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)