Breaking News

నాగార్జున వేసుకున్న ఈ షర్ట్‌కి ఓ స్పెషల్‌ ఉంది.. గుర్తుపట్టారా?

Published on Wed, 09/20/2023 - 17:01

సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్‌లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్‌ ఏదైనా డిజైనర్‌ వేర్‌ కాస్ట్యూమ్‌ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, ఫోన్స్‌,కాస్ట్యూమ్స్‌.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్‌ కోరుకుంటారు. ఇక టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన ఏ డ్రెస్‌ వేసుకున్నా పర్ఫెక్ట్‌గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్‌ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్‌ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్‌ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్‌ సీజన్‌5లో ఓ వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ షర్ట్‌ వేసుకున్నారు.

ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్‌ ఎల్లో సిల్క్‌ షర్ట్‌లో భలే అట్రాక్ట్‌ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో సుమారు  83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్‌ ధర గురించి సోషల్‌ మీడియాలో గట్టిగానే టాక్‌ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్‌ షర్ట్‌లో కనిపించడం విశేషం.

ఎంత కాస్ట్‌లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్‌ ఈవెంట్స్‌లలో రిపీట్‌ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్‌ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 
 

Videos

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు