Breaking News

పరుల సొమ్ము

Published on Sun, 11/30/2025 - 13:40

అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్లేది. అక్కడ ఆడవారు ధరించే నగలు, చూసి తాను కూడా ఒంటినిండా నగలు ధరించి తిరగాలనుకునేది.ఒక రోజు కోతి అడవికి దగ్గర్లో ఉన్న రామాపురం గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాకుమారి ఆమె మిత్రబృందం రావటం గమనించింది. రాకుమారి తన ఒంటిమీది వజ్రాల హారం  చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది.రాకుమారి›స్నానం చేస్తుండగా, కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. 

అది గమనించిన రాకుమారి, ఆమె మిత్రబృందం ‘పట్టుకోండి పట్టుకోండి!!! కోతి వజ్రాలహారం పట్టుకుని పరిగెడుతోంది!’ అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజ భటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరుగెత్తి, పరుగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడే చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస, పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ‘ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది– నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోటానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు’ అనుకుంది. 

వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది.అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడటంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి, వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాలహారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి.

పల్లా శైలజ
 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)