Breaking News

బాడీ బిల్డర్‌గా 'అడవి బిడ్డ'..!

Published on Fri, 06/27/2025 - 17:49

నో స్పాట్‌లైట్‌... నో స్పాన్సర్‌... నో బిగ్‌–సిటీ జిమ్‌...ఎన్నో ‘నో’ల మధ్య ఆమె దగ్గర ఉన్న ఏకైక ‘యస్‌’ ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఖుష్బు నాగ్‌ను ‘బాడీబిల్డర్‌’ కావాలనే తన కల నెరవేర్చుకునేలా చేసింది.

తాజాగా... ఢిల్లీలో జరిగిన ఎన్‌పీసి వరల్డ్‌వైడ్‌ బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ‘బస్తర్‌ కా షేర్నీ’ ‘వైరల్‌ బాడీ బిల్డర్‌’ ‘ఫిట్‌నెస్‌ క్వీన్‌’ అనిపించుకుంది. పేదింట్లో పుట్టిన ఖుష్బు నాగ్‌ కష్టపడి బీఎస్సీ చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే పొలం పనుల నుంచి పశువులను మేపడం వరకు ఎన్నో పనులు చేసేది. ‘బాడీబిల్డర్‌’ కావాలనేది ఆమె కల.

‘నేను బాడీబిల్డర్‌ కావాలనుకుంటున్నాను’ అనే మాట ఖుష్బు నోటి నుంచి వినిపించినప్పుడల్లా చుట్టుపక్కల వారికి చెప్పలేనంత వినోదంగా మారేది. ‘బాడీబిల్డర్‌’ అనే నిక్‌నేమ్‌తో పిలిచేవారు.అయితే ఎగతాళి మాటలకు, వెక్కిరింపులకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఖుష్బు. ఆమె ఏకైక లక్ష్యం... బాడీబిల్డర్‌. వడ్రంగి అయిన తండ్రి ‘నువ్వు సాధించగలవు’ అని ఖుష్బుకు ధైర్యాన్ని ఇచ్చాడు.

అడవిలో పెరిగిన అమ్మాయికి, జిమ్‌లు అందుబాటులో లేని అమ్మాయికి, బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ నియమనిబంధనలు చెప్పే వ్యక్తి ఒక్కరూ లేని ప్రాంతానికి చెందిన అమ్మాయికి తన కలను నెరవేర్చుకోవడం సాధ్యపడుతుందా?‘కచ్చితంగా సాధ్యమే’ అని పట్టుదలతో నిరూపించింది ఖుష్బు నాగ్‌. తన ఇంటిని జిమ్‌గా చేసుకుంది. అందుబాటులో ఉన్న వస్తువులతోనే సాధన చేసేది.

కేన్సర్‌తో ఖుష్బు తల్లి చనిపోయింది. ఆ దుఃఖం ఒకవైపు. ‘ఏదో ఉద్యోగం చూసుకోకుండా ఏమిటీ పనులు!’ లాంటి సూటిపోటి మాటలు మరోవైపు. అయినా సరే సాధన పక్కన పెట్టలేదు. పరిమిత వనరులతోనే పోరాటానికి రెడీ అయింది. ప్రతి సవాలును నిచ్చెనగా చేసుకొని లక్ష్యం వైపు దూసుకువెళ్లింది. జాతీయస్థాయిలో జరిగిన బాడీబిల్డింగ్‌ పోటీలలో ఎన్నో పతకాలు గెలుచుకుంది. ప్రతి పతకం ఖుష్బు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేది.

ఖుష్బు విజయం గురించి మాట్లాడం అంటే ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడం కాదు. ‘అడవిలో పుట్టిన వారు అడవికే పరిమితం అవుతారు’లాంటి తరతరాల భావజాలాన్ని పక్కన పెట్టిన విజేత గురించి మాట్లాడడం. ‘నీకు తోడుగా ఎవరూ లేరా? గాడ్‌ఫాదర్‌ లేడా? అయినా ఫరవాలేదు... అపురూప విజయాలు సాధించవచ్చు’ అని నిరూపించిన అడవిబిడ్డ ఆత్మవిశ్వాసం కథ.

పవర్‌ ఆఫ్‌ పట్టుదల
బాడీబిల్డర్‌ కావాలంటే ఎన్నో వనరులు ఉండాలి అంటారు. అయితే ఇలాంటి మాటలేవీ నన్ను వెనక్కి నెట్టలేదు. ప్రతి సవాలును స్వీకరించి లక్ష్యం వైపు అడుగులు వేశాను. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు అని చెబుతోంది ఖుష్బు నాగ్‌. 
 

(చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్‌ పంట..! రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలి సక్సెస్‌ స్టోరీ)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)