చేప కొరికితే అంతలానా..! పాపం అతడికి ఏకంగా..

Published on Fri, 03/14/2025 - 17:02

కుక్క లేదా ఇతర జంతువులు కొరికితే వెంటనే భయపడతాం, ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అదే చేప, పీత లాంటివి అనగానే కొందరూ లైట్‌ తీసుకుంటారు. ఎందుకంటే అవి విషపూరితం కాదనే ఫీలింగ్‌. అలానే ఈ వ్యక్తి కూడా చేపే కదే అని చాలా లైట్‌ తీసుకున్నాడు. చివరికి అది అతడి ఊహించిన బాధనే మిగిల్చింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదని వాపోతున్నాడు. ఇంతకీ అతడికి ఏం జరిగిందంటే..

కేరళలోని కన్నూర్​ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేష్‌ అనే రైతు తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న నీటిగుంటని క్లీన్‌ చేశాడు. సరిగ్గా ఆ సమయంలో కడు అనే జాతికి చెందిన చేప(క్యాట్‌ ఫిష్‌ జాతికి చెందింది) అతడి వేలిని కొరికింది. దాంతో అతడు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. నయం అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాడు. 

అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. కానీ రానురాను భాధ ఎక్కవై చెయ్యి కదిలించాలంటేనే నొప్పితో విలవిల్లాడిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఇక ఆ బాధకు తాళ్లలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు అతడికి ఎందువల్ల ఇలాంటి పరిస్థి వచ్చిందన్నది అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ వైద్యులు కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. 

బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. గ్యాస్ గ్యాంగ్రీన్​ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందని చేతివేళ్లను తొలగించారు వైద్యులు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. 

అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ఇన్ఫెక్షన్‌ అరచేయి అంతా వ్యాపించేసింది. దీంతో వైద్యులు పూర్తిగా ఆ అరచేతి మొత్తాన్ని తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..బురద నీటిలో నివశించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్​ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. 

ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలపై దాడి చేసి..ఇన్ఫెక్షన్‌ని మెదడు వరకు వ్యాప్తి చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. ఇక్కడ ఈ రైతు రాజేష్‌ కేసులో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి అరచేతిని తొలగించడం తప్పమరో అవకాశం లేదు. బురదలో ఉండే ఆ చేప కారణంగానే ఈ  బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించిందని చెప్పుకొచ్చారు వైద్యులు. 

(చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు)
 

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)