Breaking News

‘చాలా భయంకరం, ఇలా మీరు చేయకండి’: ఇటలీలో కేరళ వైద్యుడి చేదు అనుభవం

Published on Tue, 03/12/2024 - 12:42

కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్‌ ఎంజీ శశిథరూర్‌ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్‌ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.   ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్‌ రీసెర్చ్‌  చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్‌, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు.  ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో  ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు నగదుతో ఉన్న పర్సు పోయిందని  గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు నమోదు  తరువాత భారత కాన్సులేట్‌ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్‌ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను అందించారు. 

దేశం కాని దేశంలో పాస్‌పోర్ట్‌, వాలెట్‌ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్‌ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)