Breaking News

కీర్తి సురేష్‌ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్‌

Published on Fri, 01/31/2025 - 13:13

మహానటి ఫేం కీర్తి సురేష్‌  తన ప్రియుడు ఆంథోనీ తట్టిల్‌తో గత ఏడాది ఏడు అడుగులు వేసింది.  పదిహేనేళ్ల డేటింగ్‌ను అత్యంత గోప్యంగా ఉంచి ఉన్నట్టుండి  ఆంటోనీని వివాహ మాడి అభిమానులు సర్‌ప్రైజ్‌ చేసింది. తాజాగా తమ మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలును సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కీర్తి సురేష్‌ ధరించిన లేత గులాబీరంగు లెహంగా విశేషాలు ఆసక్తికరంగా మారాయి.  మరి ఆవివరాలేంటో  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

కీర్తి సురేష్ వైబ్రంట్ లెహంగాతో అందంగా మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో  భర్త ఆంథోనీతో తన మెహందీ వేడుక  ఫోటోలతోపాటు, పింక్‌  వైబ్రంట్ లెహంగా  ఫోటోలను షేర్ చేసింది.

కీర్తి, ఆంథోనీ ఇద్దరూ మ్యాచింగ్‌ దుస్తుల్లో అసలైన పెళ్లికళతో అందంగా కనిపించారు.  చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన  గులాబీ రంగు  కలిసిన  బహుళ వర్ణ  లెహెంగాలో  కీర్తి మురిపించింది. దీనికి మిర్రర్‌ వర్క్‌, మోటిఫ్‌లు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇంకా పాస్టెల్-హ్యూడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, లేత వంకాయ గులాబీ రంగు కలగలిసిన దుపట్టా మరింత ఎట్రాక్టివ్‌గా అమరాయి.   ఇక తమిళ అక్షరాలతో రూపొందిన  చెవిరింగులు భలే ఉన్నాయ్‌!

 చాలా సాధారణమైన మేకప్‌, తేలికపాటి ఆభరణాలను   ఎంచుకుంది. మరికొన్ని ఫోటోలలో సన్ గ్లాసెస్  పెట్టుకుని చలాకీగా  చిలిపిగా కనిపించింది. మరోవైపు, ఆంథోనీ మ్యాచింగ్ కుర్తా-పైజామా ధరించాడు. ప్రకాశవంతమైన-నీలం రంగు కుర్తా, గులాబీ జాకెట్‌తో కీర్తి లుక్‌కు అద్దినట్టు సరిపోయాడు.

కాగా కీర్తి సురేష, ఆంథోనీ వివాహం గ్రాండ్‌గా గోవాలో (2024, డిసెంబర్ 12) జరిగింది. తొలుత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం  మూడుముళ్లు వేయించుకుంది. అలాగే మలయాళీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే పసుపు తాడుతో తన లేటెస్ట్‌ మూవీ బేబీజాన్‌ ప్రమోషన్స్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పర్చింది. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)