Breaking News

కథాకళి: మేడమెట్లు

Published on Sun, 02/22/2026 - 13:46

‘డిటెక్టివ్‌ పెద్దబ్బాయి’ అనే బోర్డ్‌ ఉన్న ఇంట్లో ఆయన తన అసిస్టెంట్‌ చిన్నబ్బాయితో పేకాడుతున్నాడు.‘‘రెండో డైమండ్‌ ఆసు బల్ల మీదకి ఎలా వచ్చింది సార్‌?’’ చిన్నబ్బాయి కోపంగా అడిగాడు.‘‘మోటివ్‌ నీకు తెలుసు. గెలిస్తే వెయ్యి రూపాయలు. ఎలా వచ్చాయో పరిశోధన చేసి కనుక్కోవాల్సిన బాధ్యత నీదే.’’ పెద్దబ్బాయి నవ్వుతూ చెప్పాడు.‘‘మీరు డిటెక్టివ్‌గా, నేను అసిస్టెంట్‌ డిటెక్టివ్‌గా ఒకరి కలంలోంచి పుట్టిన పాత్రలం. మన సృష్టికర్త ప్రతీ కేస్‌ని మీరే పరిశోధించేలా రాస్తున్నారు. కాబట్టి అది మీ పని.’’పెద్దబ్బాయి మొబైల్‌ మోగింది. అతను ఎవరి నుంచో చూసి ఆన్సర్‌ చేశాడు.‘‘ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయిని. దయచేసి ఈ ఎడ్రస్‌కి రాగలరా?’’  ‘‘ఎందుకు?’’అవతలివైపు నుంచి చెప్పింది విని చెప్పాడు.‘‘సరే. లొకేషన్‌  పంపించండి. వెంటనే బయలుదేరుతాం.’’లైన్‌  కట్‌ చేశాక తన వంక ప్రశ్నార్థకంగా చూసే తన అసిస్టెంట్‌తో డిటెక్టివ్‌ పెద్దబ్బాయి చెప్పాడు.

‘‘ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి. హత్య. డూప్లెక్స్‌ ఇంట్లో మెట్ల మీంచి కిందపడి ఒకరు మరణించారు.’’‘‘ప్రతి మరణం హత్య కానవసరం లేదు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మనం ఇంతదాకా పరిశోధించిన ఏ కేస్‌ అయినా హత్య కాకుండా పోయిందా?’’పెద్దబ్బాయి లేచి షెర్లాక్‌ హోమ్స్‌ పైప్‌ని నోట్లో ఉంచుకుని, ఆయన పెట్టుకునేలాంటి టోపీని పెట్టుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. బీఎండబ్ల్యూ కారు ఎక్కాక చిన్నబ్బాయి డ్రైవ్‌ చేస్తూ చెప్పాడు.‘‘థ్రిల్, సస్పెన్‌ ్స పేరిట మన సృష్టికర్త మనల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడు! నా నెత్తి మీద రివాల్వర్‌ పిడితో విలన్లు ఎన్నిసార్లు బాదారో. నేను నిజం మనిషినైతే ఎప్పుడో చచ్చేవాడిని. లేదా పిచ్చెక్కేది. ఇవాళ్టి కేస్‌లో అలాంటిది కాని, మారువేషాలు కాని ఉండవని ఆశిస్తాను. పెట్టుడు గడ్డం జిగురు భయంకరమైన దురదని పుట్టిస్తుంది.’’

వారి కారు ఓ డూప్లెక్స్‌ ఇంటికి చేరుకుంది. బయట పోలీస్‌ కార్లు ఉన్నాయి.పెద్దబ్బాయిని చూసి పోలీస్‌ కాన్‌ స్టబుల్‌ సెల్యూట్‌ చేసాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. ఇద్దరూ శవాన్ని చూశారు.‘‘ఆయనకి రేచీకటి. మెట్ల మీంచి కాలుజారి పడ్డాడు. అయినా మీ అభిప్రాయం తెలుసుకుందామని రమ్మన్నాను.’’ ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘ఇది హత్య.’’ పెద్దబ్బాయి పైప్‌ గుప్పుగుప్పున పీలుస్తూ చెప్పాడు.‘‘ఎలా కనుక్కున్నారు?’’‘‘సింపుల్‌. ఇంతదాకా మేము ఎన్నడైనా ‘ఇది హత్య కాదు. ప్రమాదకర మరణం’ అని వెనక్కి తిరిగామా? హత్య అయితేనే మన పాత్రలకి ప్రయోజనం.’’ చిన్నబ్బాయి వివరించాడు.హతుడి వయసు అరవై పైనే ఉండొచ్చు. బట్టతల. సరిగ్గా తల మధ్యలో అయిన పెద్ద గాయం నుంచి రక్తం కారుతోంది. పైన నాలుగో మెట్టు మీంచి కింది మెట్టు దాకా కారిన రక్తపు చుక్కలు కనిపించాయి.

‘‘ఇతను సంపన్నుడు. ఇతని వారసుల గురించి వాకబు చేశారా?’’ పెద్దబ్బాయి అడిగాడు.ఇన్‌స్పెక్టర్‌  సైగ చేస్తే సర్వెంట్‌ మెయిడ్‌ చెప్పింది.‘‘ఈరికి మనవడు తప్ప ఇంకెవరూ లేరు. కరోనాలో అంతా పోయారు. ఇందాక ఫోన్‌  చేస్తే ఆయన ఆన్సర్‌ చెయ్యలేదు.’’‘‘ఇవాళ అతను ఇక్కడికి వచ్చి వెళ్ళాడా?’’‘‘ఇవాళ మంగళవారం. ఇక్కడ రైతు బజార్‌ నుంచి కూరలబండి వస్తుంది. నేను కూరలకి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చాడేమో తెలీదు. నేను తిరిగి రాగానే ఈయన ఇలా నేల మీద...’’ ఏడుపు వల్ల ఆవిడ మిగిలిన వాక్యాన్ని పూర్తి చేయలేదు.‘‘ఆ వారసుడి దగ్గర ఈ ఇంటి డూప్లికేట్‌ తాళంచెవి ఉందా?’’‘‘ఉంది.’’పెద్దబ్బాయి అతని నంబర్‌ అడిగి ఫోన్‌  చేశాడు.‘‘నా పేరు పెద్దబ్బాయి. డిటెక్టివ్‌ని. మీ తాతగారిని ఎవరో చంపారు.’’‘‘అరెరే. ఏమైంది?’’ అవతల నుంచి మనవడు ఆదుర్దాగా అడిగాడు.‘‘తల మీద గాయమై మరణించారు.

 అది హత్య. మీరు వెంటనే రండి.’’‘‘అది హత్య అని ఎందుకు అనుకుంటున్నారు?’’‘‘మీరు హంతకుడు కాబట్టి. ప్రతి కథలోనూ డిటెక్టివ్‌ ఎవరు హంతకుడో ఇట్టే కనుక్కుంటాడు.’’‘‘మా తాతయ్యకి రేచీకటి. మెట్లు దిగుతూ కాలుజారి మరణించి ఉండచ్చు.’’‘‘రాగానే ఆ హంతకుడిని అరెస్ట్‌ చేయండి.’’ పెద్దబ్బాయి ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయికి చెప్పాడు.‘‘అది మీరు గంభీరంగా ఓసారి పైప్‌ని తీసి దానివంక చూసి చెప్పాలి. అతనే హంతకుడనే ఆధారం ఏమిటి?’’ బుల్లెబ్బాయి అడిగాడు.‘‘అతనికి ఎవరూ అతని తాత ఎలా మరణించారో చెప్పలేదు. అయినా మెట్ల మీంచి జారిపడ్డాడని తెలిసిందంటే అతనే హంతకుడు. ఎవరైనా ఆస్తిని వీలైనంత త్వరగా అనుభవించాలని అనుకుంటారు. అందుకే ఈ దురాగతం చేశాడు.’’ఇంటికి వెళ్ళాక మళ్ళీ పేకాటకి కూర్చున్న చిన్నబ్బాయి చెప్పాడు.‘‘నాకు తెలీలేదు. మీరు నా బాస్‌ కాబట్టి ఈ బల్ల మీదకి రెండు డైమండ్‌ ఆసులు ఎలా వచ్చాయో మీరే కనుక్కోవాలి.’’ 
 ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

#

Tags : 1

Videos

కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం

పైన కుర్చీలు.. లోన మద్యం

సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్

అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్

కొంపముంచిన గంభీర్

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు

బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు

నారా లోకేష్ పక్కన ప్రమాదకర వ్యక్తులు

నాటి రాజుల విందులో ఫారిన్ ఫుడ్.. 130 ఏళ్ల నాటి మెనూ వైరల్!

Photos

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ కల్ట్‌ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)

+5

హిందూ, క్రిస్టియన్‍ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)