Breaking News

ఆట పాటల శిక్షణ

Published on Thu, 09/18/2025 - 04:08

‘ఆడుతూ  పాడుతూ కూడా చదువు హాయిగా నేర్చుకోవచ్చు’ అంటాడు అక్షయ్‌ మసెల్కర్‌.  ఉత్తర కర్నాటకలోని సిర్సి జిల్లాకు చెందిన అక్షయ్, బడి అంటే దూరంగా  పారిపోయే విద్యార్థుల కోసం హ్యుమనాయిడ్‌ రోబోను తయారు చేశాడు. దానికి ‘శిక్షణ’ అని పేరు పెట్టాడు.

ఎంత టీచర్‌ అయినప్పటికీ ‘శిక్షణ’ రూపం అచ్చం విద్యార్థిలాగే ఉంటుంది. ఒకటి నుంచి నాల్గో తరగతి విద్యార్థుల కోసం రూ΄÷ందించిన ఈ రోబో టీచర్‌ పిల్లలను నవ్విస్తూనే కన్నడ, ఇంగ్లీష్‌ భాషలలో  పాఠాలు చెబుతుంది. గేయాలు  పాడుతుంది. మాథ్స్‌ సులువుగా నేర్పిస్తుంది. ΄÷డుపు కథలు వేస్తుంది. ఒకటా రెండా... ఎన్నో ఎన్నెన్నో!}

ఈ రోబో పుణ్యమా అని బడికి దూరంగా ఉండే పిల్లలు కూడా బడికి ఇష్టంగా రావడం విశేషం. తమ రోబో టీచర్‌కు సంబంధించిన విషయాలను రోజూ ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతుంటారు.}

అక్షయ్‌ తల్లి టీచర్‌గా పనిచేసేది. తానూ టీచర్‌ కావాలనుకోవడానికి అమ్మే స్ఫూర్తి. డిగ్రీ పూర్తయిన తరువాత ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు అక్షయ్‌. 
లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలంలో విద్యావిధానం గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలోనే అతడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుండేవి. అయితే తనకు వచ్చే వినూత్న ఆలోచనలను సాకారం చేసుకునే సమయం ఉండేది కాదు.

కోవిడ్‌ కల్లోల కాలంలో బోలెడంత తీరిక దొరకడంతో తన ఐడియాలపై పనిచేసే అవకాశం వచ్చింది. పల్లెటూరు బడుల నుంచి పట్నం బడుల వరకు చాలా బడులలో బోధనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం లేదని, డ్రాయింగ్‌ చార్ట్‌లు, బ్లాక్‌బోర్డ్‌ తప్ప ఇతరత్రా ఉపకరణాలను ఉ పాధ్యాయులు ఉపయోగించడం లేదని గ్రహించాడు అక్షయ్‌.

‘మొక్కుబడిగా బోధించడం కాకుండా వినూత్నమైన పద్ధతుల్లో విద్యార్థులకు చేరువ కావాలి’ అనుకున్న అక్షయ్‌ సంవత్సరానికి పైగా పరిశోధనలు చేశాడు. సంప్రదాయ బోధన, ఆధునిక సాంకేతికతను కలిపి రోబో టీచర్‌ను తయారుచేశాడు. ఈ రోబోను తయారు చేయడానికి రెండు లక్షల రూ పాయలు ఖర్చు అయింది. ఈ ఖర్చును తానే స్వయంగా భరించాడు.

ఈ రోబోలో రెండు కార్డులు ఉంటాయి. మాస్టర్‌కార్డ్‌ అన్‌లాక్‌ కోసం, నార్మల్‌ కార్డ్‌ ఇష్టమైన ప్రోగ్రామ్‌ను స్టార్ట్‌ చేయడానికి ఉపయోగపడతాయి. మొదట్లో ఈ రోబ్‌ను 25 స్కూల్స్‌లో ఉపయోగించారు. ఆ తరువాత మరిన్ని స్కూల్స్‌కు విస్తరించారు.

‘రోబో టీచర్‌ను అక్షయ్‌ మాకు పరిచయం చేశారు. చాలా ఆసక్తిగా అనిపించింది. పిల్లలైతే ఎంతో సంతోషించారు. క్లాసులో కదలకుండా కూర్చుంటున్నారు. వారికి ఇది రోబో కాదు టీచర్, ఫ్రెండ్‌. పిల్లలకు మాత్రమే కాదు ఉ పాధ్యాయులకు కూడా రోబో ఎంతో ఉపయోగపడుతుంది. వారి భారాన్ని తగ్గిస్తోంది. సైన్స్, టెక్నాలజీ విషయాలపై ఆసక్తి పెంచుతుంది’ అంటుంది సిర్సిలోని మోడల్‌ హైయర్‌ ప్రైమరీ స్కూల్‌ సైన్స్, మ్యాథ్స్‌ టీచర్‌ సునైనా హెగ్డే.

‘శిక్షణ’ రోబో దగ్గర మాత్రమే ఆగిపోలేదు అక్షయ్‌. విద్యారంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల కోసం ‘ఎక్స్‌పిర్‌మైండ్‌’ స్టార్టప్‌ ద్వారా కృషి చేస్తున్నాడు.
‘గ్రామీణ్ర పాంత పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు భవిష్యత్‌లో వారు కూడా కొత్త ఆవిష్కరణలు చేసేలా స్ఫూర్తి కలిగించడం, ప్రోత్సహించడమే మా లక్ష్యం’ అంటున్నాడు అక్షయ్‌.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)