Breaking News

నేను నటినే!

Published on Tue, 01/28/2025 - 00:43

కార్లా సోఫియా గాస్కాన్‌... ఆస్కార్‌ నామినేషన్స్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్‌ క్రైమ్‌ ఫిల్మ్‌ ‘ఎమీలీయా పెరెజ్‌’ చిత్రంలో టైటిల్‌ క్యారెక్టర్‌ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్‌కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్‌లోని ఆల్కోబెండాస్‌లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్‌లో లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకొని నటిగా మారింది. 

హాస్య చిత్రం ‘ది నోబుల్‌ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు’, ‘యూరోపియన్‌ ఫిల్మ్‌ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్‌ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్‌ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్‌ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్‌ అవుతాను’’ అని స్పందించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)